టిక్ టాక్ కి అమెజాన్ షాకిచ్చినట్టే ఇచ్చి….

చైనీస్ యాప్ టిక్ టాక్ కి అమెజాన్ షాకిచ్చినట్టే ఇచ్చిమళ్ళీ .. విరమించుకుంది. కేవలం కొన్ని గంటల్లోనే ఈ మార్పు జరిగింది. తమ ఉద్యోగుల మొబైల్ ఫోన్లలో నుంచి మొదట దీన్ని తొలగిస్తున్నామని, బ్యాన్ చేస్తున్నామని..

టిక్ టాక్ కి అమెజాన్ షాకిచ్చినట్టే ఇచ్చి....
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 11, 2020 | 1:12 PM

చైనీస్ యాప్ టిక్ టాక్ కి అమెజాన్ షాకిచ్చినట్టే ఇచ్చిమళ్ళీ .. విరమించుకుంది. కేవలం కొన్ని గంటల్లోనే ఈ మార్పు జరిగింది. తమ ఉద్యోగుల మొబైల్ ఫోన్లలో నుంచి మొదట దీన్ని తొలగిస్తున్నామని, బ్యాన్ చేస్తున్నామని ఈ సంస్థ ప్రకటించింది. అయితే కొద్దిసేపటికే ఇది పొరబాటు అంటూ.. బ్యాన్ ఎత్తివేసింది. ఇప్పటికే టిక్ టాక్ పై భారత్ బాటలో అమెరికా కూడా వేటు వేయాలనుకుంటోంది. ఈ యాప్ సమాచారాన్ని షేర్ చేసుకునేందుకు ఆస్కారమిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆరోపించారు. కాగా.. అమెజాన్ సంస్థ మొదట తీసుకున్న నిర్ణయంతో ఈ యాప్ ని నిర్వహిస్తున్న చైనాలోని దీని మాతృక సంస్థ.. బైట్ డాన్స్ ఖంగు తింది. అయితే ఉద్యోగుల ఫోన్ల లో నుంచి దీన్ని డిలీట్ చేయాలన్న సూచన గురించి సీనియర్ ఎగ్జిక్యూటివ్ లకు తెలియదని స్టాఫ్ లోని ఓ ఉద్యోగి తెలిపాడు. ఆ తరువాత.. ఈ తాత్కాలిక బ్యాన్ పై టిక్ టాక్ , అమెజాన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగిన అనంతరం దీన్ని ఎత్తివేసినట్టు టిక్ టాక్ సిబ్బందికి పంపిన ఈ-మెయిల్ స్పష్టం చేసింది.

ఇలా ఉండగా… ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోరాదని అమెరికాలోని రిపబ్లికన్ నేషనల్ కమిటీ తమ సభ్యులను కోరింది. అలాగే దీని డౌన్ లోడింగ్ ని డిసెంబరు నుంచి నిలిపివేయాలని డెమొక్రటిక్ నేషనల్ కమిటీ కూడా అభిప్రాయపడుతోంది. గత ఏడాది అమెరికన్ నేవీ.. ఇది సైబర్ సెక్యూరిటీ థ్రెట్ అని అభివర్ణించి దీనికి చెక్ పెట్టింది.