Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 25 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 125101. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 69597. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 51784. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 3720. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • వలస కూలీల్లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు. మంచిర్యాల: జన్నారం మండలంలో ఆరు కొత్త కరోనా కేసులు. కిష్టాపూర్ లో నలుగురు, రోటిగూడెంలో ఇద్దరూ ముంబై వలస కూలీలకు కరోనా పాజిటివ్. భయాందోళనలో జన్నారం మండల వాసులు. బెల్లంపల్లి ఐసోలేషన్ కు తరలింపు.
  • పుణే లో కరోనా తో ఒక డాక్టర్ మృతి. 56 ఏళ్ల వైద్యుడు పూణేలోని సాసూన్ జనరల్ ఆసుపత్రిలో కరోనా తో కన్నుమూసినట్లు దృవీకరించిన వైద్యులు. అతను పుణే నగరంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిని నడుపుతున్నట్లు అధికారులు వెల్లడి.
  • ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ కన్నుమూత. సికింద్రాబద్ లోని ఓ ప్రవేట్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ మృతి . గతకొంత కాలంగా కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.
  • సికింద్రాబాద్ జోన్ లో కొత్త కేసులు రావడం తో అప్రమత్తం అయిన బల్దియా అధికారులు. 12 కొత్త కేసులు రావడం తో సికింద్రాబాద్ జోన్ లో పర్యేటించనున్న GHMC కమీషనర్ లోకేష్ కుమార్ తరువాయి అధికారులతో సమావేశం కానున్న లోకేష్ కుమార్. హాజరు కానున్న సికింద్రాబాద్ జోనల్ కమీషనర్,డిప్యూటీ కమిషనర్ లు.

స‌బ్జా గింజ‌ల‌తో వైర‌స్ ల‌క్ష‌ణాల‌కు చెక్‌..!

మ‌న అంద‌రికీ తెలిసిన స‌బ్జా గింజ‌ల‌తో కూడా శ‌రీరానికి కావాల్సిన మంచి పోష‌ణ ల‌భిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తుల‌సి జాతికి చెందిన స‌బ్జాతో వైర‌స్‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని సూచిస్తున్నారు.
amazing health benefits of basil seeds, స‌బ్జా గింజ‌ల‌తో వైర‌స్ ల‌క్ష‌ణాల‌కు చెక్‌..!
క‌రోనా వైర‌స్‌ నేప‌థ్యంలో అంద‌రూ హ‌డ‌లెత్తిపోతున్నారు. ఏ ఆహారం తినాలి..? ఎది తింటే వైర‌స్ బారిన ప‌డ‌కుండా ఉంటాం..? ఇలాంటి సందేహాలు ప్ర‌స్తుతం అంద‌రినీ వెంటాడుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మ‌న అంద‌రికీ తెలిసిన స‌బ్జా గింజ‌ల‌తో కూడా శ‌రీరానికి కావాల్సిన మంచి పోష‌ణ ల‌భిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తుల‌సి జాతికి చెందిన స‌బ్జాతో వైర‌స్‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని సూచిస్తున్నారు.
స‌బ్జా గింజ‌లు మ‌నంద‌రికీ తెలుసు.  తీపి తులసి, ఫాలుదా అని పిలిచే ఈ గింజ‌ల్లో అద్భుత‌మైన పోష‌కాలు, ఔష‌ధ గుణాలు ఉన్నాయి. న‌ల్ల‌గా ఉండి ఆవాల‌కంటే కూడా చిన్న సైజులో ఉండే ఈ గింజ‌ల్లో ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, శ‌రీరానికి అవ‌స‌ర‌మైన కొవ్వులు, పీచు పుష్క‌లంగా ఉన్నాయి. ఈ గింజ‌ల్లో యాంటీఆక్సిడెంట్లు సైతం పుష్క‌లంగా ఉన్నాయి. వీటిని నీళ్ల‌లో నాన‌బెట్టి ఆ నీటిని తాగితే గింజ‌లు న‌మ‌ల‌డానికి వీలుగా ఉంటాయి. ప్ర‌తిరోజూ క‌నీసం రెండు టీస్పూన్ల స‌బ్జా గింజ‌ల‌ను తీసుకోవ‌టం ఆరోగ్యానికి మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు.
స‌బ్జా గింజ‌ల‌ను వేడినీటిలో నాన‌బెట్టి తీసుకోవ‌టం వ‌ల‌న ఇవి బాగా ఉబ్బి, వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు విడుద‌లై… జీర్ణ‌క్రియ‌కు ప‌నికొచ్చే ఎంజైములు ఉత్ప‌త్తి అవుతాయి. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు ఉండ‌టం వ‌ల‌న…ఈ ఆసిడ్లు శ‌రీరంలో కొవ్వుని క‌రిగించే జీవ‌క్రియ‌ని వేగ‌వంతం చేస్తాయి. అంతే కాక ఇందులో ఉన్న పీచు ఆకలిని త‌గ్గిస్తుంది. ఈ కార‌ణంగా స‌బ్జా గింజ‌లు బ‌రువుని త‌గ్గిస్తాయ‌ని చెబుతున్నారు.
సబ్జా గింజలలో యాంటిస్పాస్మోడిక్ ఉంటుంది. ఇవి స్పాస్మాటిక్ కండరాలలో ఉద్రిక్తతను తగ్గించి ఉపశమనం క‌లిగిస్తాయి. ఈ విధంగా దగ్గును నియంత్రించడంలో సాయపడుతుంది. ఇవి శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. వైసెనిన్, ఓరింటిన్, బీటా కెరోటిన్ వంటి ఫ్లేవనాయిడ్స్ శరీర  రక్షణ వ్యవస్థను బలపరుస్తాయ‌ని చెబుతున్నారు. అయితే, చిన్న‌పిల్ల‌లు, గ‌ర్భీణీలు మాత్రం వైద్యుల స‌ల‌హా మేర‌కు మాత్ర‌మే వీటిని తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.

Related Tags