Breaking News
  • కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు చంద్రబాబు లేఖ. నరేగా పెండింగ్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని వినతి. ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ.. నిధులు విడుదల చేయకుండా పెండింగ్‌లో ఉంచింది. గతంలో నరేగా పనులు చేసినవారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది -లేఖలో చంద్రబాబు.
  • పదేళ్లలో జమ్మికుంట-హుజూరాబాద్‌ నగరాలు కలిసిపోతాయి. జంట నగరాలకు మున్సిపల్ చైర్మన్లుగా టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలుస్తారు. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా.. కేసీఆర్‌ నన్ను నియమించారు-వినోద్‌కుమార్‌. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలి -ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్.
  • కడప: పోరుమామిళ్ల మండలం మార్కాపురం దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీకొని సిలాస్‌ అనే వ్యక్తికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • నగరపాలక, మున్సిపల్‌ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేశాం. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో రేపు ఓట్ల లెక్కింపు. ఈ నెల 27న మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నికకు పరోక్ష ఎన్నికలు. ఈనెల 29న కరీంనగర్‌ మేయర్‌ ఎన్నిక-నాగిరెడ్డి. రేపు సాయంత్రంలోగా అన్ని ఫలితాలు వస్తాయి. పార్టీలు మేయర్‌, చైర్‌పర్సన్ల పేర్లను ఏ, బీ ఫారాల ద్వారా ఇవ్వాలి. ఈ నెల 26న ఉ.11 గంటలలోగా ఏ ఫామ్‌ ఇవ్వాలి. ఈ నెల 27న ఉ.11 గంటలలోగా బీ ఫామ్‌ ఇవ్వాలి -తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి.
  • శాసనమండలి తీరుపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఆగ్రహం. మంచి వ్యక్తితో తప్పుడు పనిచేయించిన చంద్రబాబును ఎవరూ క్షమించరు. వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని అడిగే హక్కు టీడీపీకి లేదు. ముందు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. ఎన్నికలకు వెళ్లాలి -ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.

అంగరంగ వైభవంగా ఆకాశ్‌-శ్లోకాల వివాహం

, అంగరంగ వైభవంగా ఆకాశ్‌-శ్లోకాల వివాహం

ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ కుమారుడు ఆకాశ్‌-శ్లోకాల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్‌ సెంటర్ ఈ వేడుకకు వేదికైంది. చిన్ననాటి స్నేహితులైన ఆకాశ్‌-శ్లోకాలు ప్రముఖుల సమక్షంలో ఒక్కటయ్యారు. పెళ్లి దుస్తుల్లో వధూవరులు మెరిసిపోయారు.ఈ వేడుకకు రాజకీయ సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు.
, అంగరంగ వైభవంగా ఆకాశ్‌-శ్లోకాల వివాహం

బాలీవుడ్ ప్రముఖులు ఆమిర్‌ ఖాన్-కిరణ్‌ రావు దంపతులు, జుహీ చావ్లా, ఐశ్వర్య రాయ్‌ కుటుంబం, కరీనా కపూర్‌, కరిష్మా కపూర్‌, రజినీకాంత్‌, సౌందర్య-విశాఖన్‌ దంపతులు, రణ్‌బీర్‌ కపూర్‌, కరణ్‌ జోహార్‌, అయాన్‌ ముఖర్జీ, షారుక్ ఖాన్‌-గౌరీ దంపతులు, టీమిండియా మాజీ క్రికెటర్లు సచిన్‌ తెందుల్కర్‌ -అంజలి, జహీర్‌ ఖాన్‌-సాగరిక, యువరాజ్‌ సింగ్‌, బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌-కేరీ దంపతులు, ఐరాస మాజీ జనరల్‌ సెక్రటరీ బాన్‌ కీ మూన్‌, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌-అంజలీ పిచాయ్‌ దంపతులు, వ్యాపార వేత్త లక్ష్మి మిత్తల్‌ తదితరులు వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో అతిథులు తరలి వచ్చారు. మూడు రోజుల పాటు వివాహ వేడుకలు కొనసాగనున్నాయి. వివాహ వేదిక వద్దకు ఫోన్లు, కెమెరాలు తీసుకురావద్దని అంబానీ కుటుంబం ముందే అతిథులను కోరింది.