గల్ఫ్ దేశాలకు ఎగిరిన విమానాలు

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల స్వదేశీ తరలింపు ప్రారంభమైంది. ఎయిరిండియాకు చెందిన రెండు విమానాలు గురువారం సాయంత్రం కేరళ నుంచి బయల్దేరాయి.  వీటిలో ఒకటి సాయంత్రం 4 గంటల 15 నిముషాలకు కొచ్చి నుంచి అబుదాబి బయలుదేరింది. ఇది రాత్రి 9.40 కి తిరిగి కొచ్చి చేరుకుంటుంది. అలాగే కోజికోడ్ నుంచి మరో విమానం సాయంత్రం 5 గంటలకు ఎగిరింది. ఇది రాత్రి 10.40 కి తిరిగి కోజికోడ్ చేరుతుంది. ఈ దేశాల్లో సుమారు 350 మంది […]

గల్ఫ్ దేశాలకు ఎగిరిన విమానాలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 07, 2020 | 6:13 PM

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల స్వదేశీ తరలింపు ప్రారంభమైంది. ఎయిరిండియాకు చెందిన రెండు విమానాలు గురువారం సాయంత్రం కేరళ నుంచి బయల్దేరాయి.  వీటిలో ఒకటి సాయంత్రం 4 గంటల 15 నిముషాలకు కొచ్చి నుంచి అబుదాబి బయలుదేరింది. ఇది రాత్రి 9.40 కి తిరిగి కొచ్చి చేరుకుంటుంది. అలాగే కోజికోడ్ నుంచి మరో విమానం సాయంత్రం 5 గంటలకు ఎగిరింది. ఇది రాత్రి 10.40 కి తిరిగి కోజికోడ్ చేరుతుంది. ఈ దేశాల్లో సుమారు 350 మంది భారతీయులు ఉన్నారు. మహిళలు, పిల్లలు మినహా పెద్దవారిని ఏడు రోజులపాటు సంస్థాగత జ్వారంటైన్ కి తరలిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. మొదటి ఐదు రోజుల్లో గల్ఫ్ లోని వివిధ దేశాల నుంచి దాదాపు రెండు వేల  మంది భారతీయులను స్వదేశానికి తీసుకురానున్నారు. వీరంతా కన్నూరు, కోజికోడ్, కొచ్చి, తిరువనంతపురం చేరుకోనున్నారు.