మీ డైట్‌ప్లాన్‌లో కిస్‌మిస్‌ చేర్చి చూడండి.

యాంత్రిక జీవనం మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ఉరుకుల పరుగుల ప్రపంచంలో నిద్ర లేవడంతోనే బిజీబిజీగా పనులలో మునిగిపోతున్నారు. ఉద్యోగం, కుటుంబ వ్యవహారాల చట్రంలో చిక్కుకున్న సగటు మనిషి ఆరోగ్యాన్ని నిర్లక్ష్య చేస్తున్నాడు. ఫలితంగా అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. శారీరక శ్రమ కరువై చిన్న వయస్సులోనే పెద్ద రోగాల బారిన పడుతున్నారు. అయితే చిన్నపాటి జాగ్రత్తలతో ఈ సమస్యలకు చెక్‌ చెప్పవచ్చంటున్నారు నిపుణులు.  పకడ్బందీ ప్రణాళిక, క్రమబద్దమైన డైట్‌ ప్లాన్‌తో ఆరోగ్యాన్ని ఒడిసిపట్టవచ్చని సూచిస్తున్నారు. మనలో చాలా మందికి […]

మీ డైట్‌ప్లాన్‌లో కిస్‌మిస్‌ చేర్చి చూడండి.
Follow us

|

Updated on: Aug 26, 2019 | 6:53 PM

యాంత్రిక జీవనం మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ఉరుకుల పరుగుల ప్రపంచంలో నిద్ర లేవడంతోనే బిజీబిజీగా పనులలో మునిగిపోతున్నారు. ఉద్యోగం, కుటుంబ వ్యవహారాల చట్రంలో చిక్కుకున్న సగటు మనిషి ఆరోగ్యాన్ని నిర్లక్ష్య చేస్తున్నాడు. ఫలితంగా అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. శారీరక శ్రమ కరువై చిన్న వయస్సులోనే పెద్ద రోగాల బారిన పడుతున్నారు. అయితే చిన్నపాటి జాగ్రత్తలతో ఈ సమస్యలకు చెక్‌ చెప్పవచ్చంటున్నారు నిపుణులు.  పకడ్బందీ ప్రణాళిక, క్రమబద్దమైన డైట్‌ ప్లాన్‌తో ఆరోగ్యాన్ని ఒడిసిపట్టవచ్చని సూచిస్తున్నారు.

మనలో చాలా మందికి ఉదయాన్నే ఏ ఆహారం తినాలో తెలియదు..ఏదో ఒకటి లాగించేస్తుంటారు. ఇంకొందరు రోటీన్‌ టిఫిన్స్‌ చేస్తారు. మరికొందరు అసలు ఉదయాన్నే ఏమీ తినకుండా ఉంటారు. కానీ, ఉదయాన్నే మనం తీసుకునే ఆహారమే మన దినచర్యను ప్రభావితం చేస్తుందంట. అందుకే కొన్ని ఆహార నియమాలను పాటించాలని సూచిస్తున్నారు పలువురు డైట్‌ స్పెషలిస్టులు. అవేంటో చూద్దాం…

* ఉదయం లేవడంతోనే కాఫీ, టీలకు బదులుగా ఒకటి లేదా రెండు గ్లాసుల నీటిని తాగడం మంచిదని చెబుతున్నారు.

* ఉదయాన్నే మనం తాగే నీరు శరీరంలోని వ్యర్థాలను తొలగించి, జీర్ణక్రియలో సహాయం చేస్తుంది. బరువు తగ్గించుకునేందుకు కూడా నీరు దొహదపడుతుంది.

* మంచి శ్వాస, మైగ్రెయిన్‌, తలనొప్పితో బాధపడేవారు పరగడుపునే నీటిని తాగడం వల్ల ఫలితం ఉంటుంది. * మంచి ఏకాగ్రతకు, మెరుగైన రోగనిరోధక శక్తికి నీరు అవసరం.

*తర్వాత ఒక అరటి పండు..లేదా సీజనల్‌ వారిగా లభించే ఏదో ఒక పండును తీసుకోవాలట. ఇంకా నీటిలో నానాబెట్టిన ఎండుద్రాక్షను తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

* వైరల్ జ్వరాలు, ఇన్‌ఫెక్షన్లతో బాధపడేవారు కిస్‌మిస్‌ పండ్లను తింటుంటే త్వరగా కోలుకుంటారు.*  ఎండుద్రాక్షలో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.

* ఎండుద్రాక్షలో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారిస్తుంది. శరీరంలో రక్తాన్ని వృద్ధి చేస్తుంది.

* ఉదయాన్నే ఎండు ద్రాక్షలతోపాటు కొన్ని వెల్లుల్లి రెబ్బలను పచ్చిగా అలాగే తింటుంటే బీపీ అదుపులోకి వస్తుంది.

* మధుమేహం ఉన్నవారు ఎండు ద్రాక్షలను తింటుంటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి.

* విటమిన్‌ బి, పోటాషీయం వంటి పోషకాలు కిస్‌మిస్‌ పండ్లలో ఉన్నాయి. ఇవి గుండె సంబంధ వ్యాధ్యులకు అడ్డుగోడగా నిలుస్తాయి.

*రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అధిక బరువు ఉన్న వారు నిత్యం కొన్ని కిస్‌మిస్‌ పండ్లను తింటే బరువును తగ్గించుకోవచ్చు.

* ఉదయాన్నే ఎండు ద్రాక్షలను తినడం వల్ల రోజంతా ఉత్తేజంగా ఉంటుంది. రోజంతటికీ కావాల్సిన శక్తి లభిస్తుంది. ఉద్యోగులకు, పిల్లలకు కిస్‌మిస్‌ పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి.

* ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్స్‌ కూడా పుష్కలంగానే ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ప్రీ ర్యాడికల్స్‌ నుంచి శరీరానికి రక్షణగా నిలుస్తాయి. పలు రకాల క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా పోరాడుతాయి.

* జీర్ణ సంబంధ సమస్యలు పరిష్కారమవుతాయి. మలబద్దకం తొలగిపోతుంది. గ్యాస్‌ అసిడిటీ వంటివి తగ్గుతాయి.

* ముఖ్యంగా మహిళల్లో వచ్చే నెలసరి నొప్పుల నివారణకు, పీసీఓడీ సమస్యలు తలెత్తకుండా నానబెట్టిన ఎండుద్రాక్ష ఎంతగానో మేలు చేస్తుందట.