తాప్సీ లవర్ అతడు కాదట..!

Actress Taapsee Pannu opens up about his boyfriend, తాప్సీ లవర్ అతడు కాదట..!

తెలుగులో గ్లామర్ షోకి తప్ప నటనకి పనికిరాదని ముద్ర వేయించుకున్న తాప్సీ.. నేడు బాలీవుడ్‌లో మంచి ఫర్‌ఫామర్‌గా ప్రశంసలు అందుకుంటోంది. అక్కడ తాప్సీకి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు ఉంది. అంతేకాదు, రియల్ లైఫ్‌లోనూ డేరింగ్ హీరోయిన్ అనే ఇమేజ్ దక్కింది తాస్పీకి. ఇంతకుముందు పెళ్లి విషయంలో వివాదాస్పద స్టేట్‌మెంట్స్ ఇచ్చిన ఈ భామ ఇప్పుడు కొంత వెనక్కి తగ్గింది. తన లవ్‌ లైఫ్ గురించి కూడా క్లారీటీ ఇచ్చింది. ఒక బాలీవుడ్ హీరోతో ఆమెది సీక్రెట్ లవ్ అఫైర్ అని చాలా కాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ గాసిప్‌ల సౌండ్ ఇప్పుడు లైడ్ స్పీకర్ రేంజ్‌లో మార్మోగుతుండడంతో తానే స్వయంగా అసలు విషయాన్ని బయటపెట్టింది.

అభిమానులతో చాటింగ్‌ చేసిన తాప్సీ.. తనంతట తానుగా.. తన లవ్ లైఫ్ గురించి వివరించింది. నేను లవ్‌లో ఉన్న మాట వాస్తవమే. ఇందులో దాచుకునేదేమీ లేదు. అయితే.. అందరూ అనుకుంటున్నట్లు అతను సినిమా హీరో కాదు, క్రికెటర్ అంతకన్నా కాదు అంటూ క్లారిఫికేషన్ ఇచ్చింది. కాగా.. ఆ విషయాన్ని ఇప్పుడే బయటపెట్టలేదని అంటోంది. మరి ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరు? కాకపోతే అతను ఇక్కడి వాడు కాదని హింట్ ఇచ్చింది. మన దేశానికి చెందని వ్యక్తితో రిలేషన్ షిప్‌లో ఉందట.

Actress Taapsee Pannu opens up about his boyfriend, తాప్సీ లవర్ అతడు కాదట..!

తాప్సీ ఇంతకుముందు ఒక విదేశీ బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో డేటింగ్ చేసింది. ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పి.. ఒక బాలీవుడ్‌ హీరోతో డేటింగ్ మొదలు పెట్టింది. రీసెంట్‌గా పెళ్లయిన ఒక బాలీవుడ్‌ హీరోతో రిలేషన్‌షిప్‌తో ఉందన్న పుకారు బయటికి వచ్చింది. మొదట ఈ విషయంలో స్పందించలేదు. తరువాత ఆ హీరో కాపురంలో చిచ్చురేగిందని.. ఒక పత్రిక వార్తను ప్రచురించింది. సో.. వీటికి ఎండ్ కార్డ్ వేసేందుకు తాప్సీ ఇలా తన వెర్షన్‌ని చెప్పుకొచ్చింది.

పింక్, ముల్క్, నీవెవరో, ఆనందో బ్రహ్మ, బద్‌లా, గేమ్ ఓవర్, మిషన్ మంగల్ వంటి రీసెంట్ సినిమాలతో ఒక్కసారిగా స్టార్‌గా తన రేంజ్‌ని పెంచుకొంది తాప్సీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *