ఉపరాష్ట్రపతిపై రజనీ సంచలన వ్యాఖ్యలు

Rajnikanth sensational comments on vice president Venkaiah Naidu, ఉపరాష్ట్రపతిపై రజనీ సంచలన వ్యాఖ్యలు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై సూపర్‌స్టార్ రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకయ్య రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశారంటూ వ్యాఖ్యనించారు. చెన్నైలో  జరిగిన లిజనింగ్, లెర్నింగ్ అండ్ లీడింగ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కేంద్రమంత్రి అమిత్ షా, ఉపరాష్ట్రపతి వెంకయ్య హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి రజనీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రజనీ చేసిన వ్యాఖ్యలతో వెంకయ్యనాయుడు కూడా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ప్రసంగాన్ని కొనసాగిస్తూ వెంయ్యనాయుడు  ఓ గొప్ప ఆధ్యాత్మికవేత్త అని, పొరబాటున రాజకీయ నాయకుడయ్యారన్నారు. అలాంటి ఆధ్యాత్మికవేత్తను పోగొట్టున్నామన్నారు. రజనీ చేసిన వ్యాఖ్యలతో సభలో అంతా నవ్వుకోవాల్సి వచ్చింది. గత శనివారం చెన్నైలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *