కరోనా వేళ.. ఉద్యోగులకు బోనస్‌ వేసిన ‘యాక్సెంచర్’ సంస్థ..!

కరోనా విపత్కర పరిస్థితుల్లో కొన్ని కంపెనీలు ఉద్యోగులను తీసేసిన విషయం తెలిసిందే. కొన్ని కంపెనీలు ఉద్యోగుల జీతాల్లో కోతను విధిస్తున్నాయి

కరోనా వేళ.. ఉద్యోగులకు బోనస్‌ వేసిన 'యాక్సెంచర్' సంస్థ..!
Follow us

| Edited By:

Updated on: May 30, 2020 | 3:08 PM

కరోనా విపత్కర పరిస్థితుల్లో కొన్ని కంపెనీలు ఉద్యోగులను తీసేసిన విషయం తెలిసిందే. కొన్ని కంపెనీలు ఉద్యోగుల జీతాల్లో కోతను విధిస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు బోనస్‌ వేసింది ప్రముఖ ఐటీ దిగ్గజం యాక్సెంచర్‌. ఆ సంస్థలో పనిచేస్తున్న చాలా మందికి ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు బోనస్‌లు చెల్లించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా మొత్తం లక్ష మందికి పైగా ఉద్యోగులకు లబ్ది చేకూరినట్లు తెలుస్తోంది.

గత కొన్ని రోజుల్లో కొత్తగా ఆఫర్ లెటర్లు ఇచ్చిన వారందరికీ ఉద్యోగాలు ఇచ్చినట్లు యాక్సెంచర్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. కంపెనీలో చేరిన మరుక్షణం నుంచి అన్ని రకాల వేతన సౌకర్యాలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఫ్రెంచ్‌ కంపెనీ క్యాప్‌జెమినీ సైతం ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, బోనస్‌లు ఇస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించగా.. మొత్తం సిబ్బందిలో 70శాతం వరకు దీని వలన లబ్ది పొందినట్లు సమాచారం.

Read This Story Also: మూడు నెలల తరువాత భారత్‌కి రానున్న చెస్‌ లెజండ్..!