మూడు నెలల తరువాత భారత్‌కి రానున్న చెస్‌ లెజండ్..!

భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఎట్టకేలకు స్వదేశానికి రానున్నారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో విధించిన ఆంక్షల వలన మూడు నెలలుగా విశ్వనాథన్ జర్మనీలో చిక్కుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఆయన భార్య అరుణ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఫ్రాంక్‌పోర్ట్‌ నుంచి ఎయిర్ ఇండియాకు చెందిన AI-120 విమానంలో ఢిల్లీ మీదుగా ఆయన బెంగళూరుకు రానున్నారు. ఆ తరువాత కర్ణాటక ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 14 రోజుల పాటు ఆయన క్వారంటైన్‌లో ఉండనున్నారు. కర్ణాటకలో […]

మూడు నెలల తరువాత భారత్‌కి రానున్న చెస్‌ లెజండ్..!
Follow us

| Edited By:

Updated on: May 30, 2020 | 1:36 PM

భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఎట్టకేలకు స్వదేశానికి రానున్నారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో విధించిన ఆంక్షల వలన మూడు నెలలుగా విశ్వనాథన్ జర్మనీలో చిక్కుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఆయన భార్య అరుణ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఫ్రాంక్‌పోర్ట్‌ నుంచి ఎయిర్ ఇండియాకు చెందిన AI-120 విమానంలో ఢిల్లీ మీదుగా ఆయన బెంగళూరుకు రానున్నారు. ఆ తరువాత కర్ణాటక ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 14 రోజుల పాటు ఆయన క్వారంటైన్‌లో ఉండనున్నారు.

కర్ణాటకలో క్వారంటైన్‌ నిబంధనలను పూర్తి చేసుకున్న తరువాత విశ్వనాథ్, చెన్నైకి రానున్నట్లు అరుణ తెలిపారు. కాగా ఇంటర్నేషనల్‌ చెస్ టోర్నీలో పాల్గొనేందుకు ఫిబ్రవరిలో ఆనంద్‌ ఐరోపాకు వెళ్లారు. వైరస్ విస్తరణ పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో లాక్‌డౌన్ విధించగా.. ఆయన జర్మనీలోని బాడ్‌సోడెన్ టౌన్‌లో చిక్కుకుపోయారు. ఇక మార్చి నెలలోనే ఆయనకు భారత్‌కి వచ్చే అవకాశం వచ్చింది. కానీ చెన్నైకి చేరుకునే సూచనలు కనిపించకపోవడంతో ఆయన అక్కడే ఆగిపోయారు. ఇక జర్మనీలోనే ఉంటూ ఆన్‌లైన్‌ చెస్ టోర్నీ ద్వారా ఆనంద్ పీఎం కేర్స్‌ ఫండ్‌కి విరాళాలు సేకరించారు. చెస్ ప్రముఖులు ద్రోణవల్లి హారిక, కోనేరు హంపీ, హరికృష్ణలతో కలిసి ఆయన టోర్నీని నిర్వహించారు.

Read This Story Also: తండ్రి అయిన అమలాపాల్ మాజీ భర్త..!