భారత్‌‌లోనే అభినందన్‌కు అసలు పరీక్ష

న్యూఢిల్లీ: ఎంతో వీరత్వాన్ని ప్రదర్శించారు అభినందన్. మన దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించి పాక్ యుద్ధ విమానాలను తరిమి కొట్టడంలో అభినందన్ పాత్ర చాలా కీలకం. ఎఫ్-16 విమానాన్ని అభినందన్ దెబ్బ తీశాడు. ఎంతో శక్తివంతమైన ఎఫ్-16ని పాత కాలంనాటి మిగ్-21తో కూల్చిన వీరుడు అభినందన్ దురదృష్టవశాత్తు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పారాచ్యూట్ సాయంతో ల్యాండ్ కావాల్సి వచ్చింది. పాక్ చేతికి చిక్కి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఎట్టకేలకు శుక్రవారం మళ్లీ భారత్‌లో అడుగు పెట్టి భరతమాత […]

భారత్‌‌లోనే అభినందన్‌కు అసలు పరీక్ష
Follow us

|

Updated on: Mar 02, 2019 | 2:15 PM

న్యూఢిల్లీ: ఎంతో వీరత్వాన్ని ప్రదర్శించారు అభినందన్. మన దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించి పాక్ యుద్ధ విమానాలను తరిమి కొట్టడంలో అభినందన్ పాత్ర చాలా కీలకం. ఎఫ్-16 విమానాన్ని అభినందన్ దెబ్బ తీశాడు. ఎంతో శక్తివంతమైన ఎఫ్-16ని పాత కాలంనాటి మిగ్-21తో కూల్చిన వీరుడు అభినందన్ దురదృష్టవశాత్తు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పారాచ్యూట్ సాయంతో ల్యాండ్ కావాల్సి వచ్చింది.

పాక్ చేతికి చిక్కి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఎట్టకేలకు శుక్రవారం మళ్లీ భారత్‌లో అడుగు పెట్టి భరతమాత ముద్దుబిడ్డగా ఘనస్వాగతం అందుకున్నాడు. అయితే అభినందన్‌కు అసలు పరీక్ష భారత్‌లోనే.

రెండు రోజులపాటు పాక్‌ ఆర్మీ చేతిలో బంధీగా ఉండటంతో అభినందన్‌కు తప్పనిసరిగా కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అభినందన్‌ను భారత వాయుసేన ఇంటెలిజెన్స్‌ యూనిట్‌కు అప్పగిస్తుంది. అభినందన్‌ శారీరకంగా ఎంత ఫిట్‌నెస్‌తో ఉన్నారో కొన్ని వైద్య పరీక్షలు చేస్తారు. దుస్తుల్లో గానీ, శరీర భాగాల్లో కానీ ఏమైనా చిప్‌లు అమర్చిందేమోనన్న అనుమానంతో బగ్‌ స్కాన్‌ చేస్తారు.

దీంతో పాటు మానసిక స్థితిని కూడా పరీక్షిస్తారు. పాకిస్తాన్ పెట్టిన ఒత్తిడిని తట్టుకోలేక దేశ రహస్యాలేమైనా లీక్ చేశాడా అన్న కోణంలో కూడా అభినందన్ కఠిన పరీక్షలు ఎదుర్కోనున్నారు. ఆ తర్వాత ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ), రీసెర్చ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) అధికారులు కూడా అభినందన్‌ను క్షుణ్నంగా విచారిస్తారు.

పాక్ పెట్టిన టార్చర్‌ భరించలేక వాళ్లకు లొంగిపోయారా? వాళ్ల గూఢచారిగా మారి ఇక్కడకు వచ్చారా? ఇలా పలు కోణాల్లో పరీక్షిస్తారు. ఈ అన్ని పరీక్షల తర్వాతనే విధుల్లోకి తీసుకోవడంపై నిర్ణయం ఉంటుంది. అది కూడా మళ్లీ పాత బాధ్యతలనే ఇస్తారా లేక డ్యూటీ మారుస్తారా అనేది కూడా నిర్ణయిస్తారు. ఆ తర్వాతనే తనను ఇంటికి పంపిస్తారు.