పుల్వామా పోలీస్ స్టేషన్‌పై ఉగ్ర‌దాడి… ఏడుగురికి గాయాలు

civilians, పుల్వామా పోలీస్ స్టేషన్‌పై ఉగ్ర‌దాడి… ఏడుగురికి గాయాలు" srcset="https://tv9telugu.com/wp-content/uploads/2019/06/pulwama-1.jpg 780w, https://tv9telugu.com/wp-content/uploads/2019/06/pulwama-1-300x180.jpg 300w, https://tv9telugu.com/wp-content/uploads/2019/06/pulwama-1-768x461.jpg 768w, https://tv9telugu.com/wp-content/uploads/2019/06/pulwama-1-600x360.jpg 600w" sizes="(max-width: 780px) 100vw, 780px" />

సరిహద్దులో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. వరుసగా దాడులు చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నిన్న ఆర్మీ మేజర్ చనిపోగా .. ఇవాళ పోలీసు స్టేషన్ లక్ష్యంగా గ్రేనెడ్ విసిరారు. పుల్వామా పోలీసుస్టేషన్‌ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి చేశారు. ఇవాళ స్టేషన్‌పై గ్రేనెడ్ విసిరారు. దీంతో అక్కడే ఉన్న 10 మంది పౌరులు గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో వారిని శ్రీనగర్ ఆసుపత్రికి తరలించినట్టు పోలీసు అధికారులు చెప్పారు. భద్రతా బలగాలు వెంటనే ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *