తెలంగాణలో 20వేలు దాటిన కరోనా కేసులు.. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే..

కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకి కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే 1,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ

తెలంగాణలో 20వేలు దాటిన కరోనా కేసులు.. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే..
Follow us

| Edited By:

Updated on: Jul 04, 2020 | 12:04 AM

Coronavirus In Telangana: కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకి కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే 1,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. శుక్రవారం మొత్తం 5,965 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 4,073 శాంపిల్స్ ఫలితం నెగిటివ్ వచ్చిందని, 1,892 శాంపిల్స్ ఫలితం పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో ఒక్కరోజులో ఇన్ని కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

రాష్ట్రంలోని 1,892 కరోనా పాజిటివ్ కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 1,658 కరోనా కేసులు నమోదుకాగా.. రంగారెడ్డిలో 56, మేడ్చల్ 44, సంగారెడ్డి 20, కరీంనగర్ 1, మహబూబ్‌నగర్ 12, గద్వాల్ 1, రాజన్న సిరిసిల్ల 6, ఖమ్మం 2, కామారెడ్డి 6, నల్గొండ 13, సిద్దిపేట్ 3, ములుగు 1, వరంగల్ రూరల్ 41, జగిత్యాల 1, మహబూబాబాద్ 7, నిర్మల్ 2, మెదక్ 3, నిజామాబాద్ 3, వరంగల్ అర్బన్ 1, భద్రాద్రి కొత్తగూడెం 4, నాగర్ కర్నూల్ 1, వికారాబాద్ 1, వనపర్తి జిల్లాలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం బులిటెన్‌లో వెల్లడించింది.

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం కరోనా వల్ల 8 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో.. తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 283కు చేరింది. తెలంగాణలో కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో 1,126 మంది ఇవాళ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,462కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 9,984.

Also Read: ముంబైలో భారీ వర్షాలు.. పురాతన భవనాలకు ముప్పు..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు