Breaking News
  • తూ.గో: పెద్దాపురంలో దారుణం. యర్రా శివశంకర్‌ అనే వ్యక్తిపై నగేష్‌ కత్తితో దాడి. పరిస్థితి విషమం, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు.
  • అమరావతి: ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. ప్రలోభాలకు లొంగలేదనే మండలి రద్దు తీర్మానం చేశారు. సెలెక్ట్‌ కమిటీ అంటే జగన్‌కు ఎందుకంత భయం. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఎందుకు విచారణ జరపలేదు -ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు.
  • మద్దాల గిరిని ఆర్థికంగా బెదిరించి పార్టీలోకి లాక్కున్నారు.
  • 11 మంది భారతీయ మత్స్యకారులను బంధించిన శ్రీలంక. ఒక పడవను స్వాధీనం చేసుకున్న శ్రీలంక నేవీ సిబ్బంది.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం. 16 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.02 కోట్లు. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 44,366 మంది భక్తులు.
  • సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ బదిలీ. అమోయ్‌ కుమార్‌ను రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు. నేరేడుచర్ల ఇంచార్జి కమిషనర్‌ మహేందర్‌రెడ్డి సస్పెన్షన్‌. తహశీల్దార్‌ రాంరెడ్డికి ఇంచార్జి బాధ్యతలు. కేవీపీ ఓటు విషయంలో అధికారుల తీరుపై ప్రభుత్వం చర్యలు.

దేశీయ క్రికెటర్‌పై జీవితకాల నిషేధం

, దేశీయ క్రికెటర్‌పై జీవితకాల నిషేధం

న్యూఢిల్లీ:  ఢిల్లీ డిస్ట్రిక్స్‌ అసోసియేషన్‌(డీడీసీఏ) సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ అమిత్‌ భండారీపై దాడికి పాల్పడిన అండర్‌-23 క్రికెటర్‌ అనూజ్‌ దేడాపై జీవితకాలం నిషేధం విధించారు. ఈ మేరకు ఆ క్రికెటర్‌ను జీవితకాలం ఏ క్రికెట్‌ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్లు డీడీసీఏ స్పష్టం చేసింది. ‘ అమిత్‌ భండారీపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన యువ క్రికెటర్‌ అనూజ్‌ దేడాపై జీవితకాల నిషేధం విధిస్తున్నాం. ఇక్కడ అనూజ్‌ దేడాపై న్యాయపరమైన చర్యలను పక‍్కకు పెడితే, అతను ఇక నుంచి ఏ క్రికెట్‌ ఆడకుండా జీవితకాలం నిషేధం విధిస్తూ చర్యలు తీసుకున్నాం’ అని డీడీసీఏ అధ్యక్షుడు రజత్‌ శర్మ తెలిపారు.

భారత క్రికెట్‌ జట్టు మాజీ పేసర్, డీడీసీఏ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ అమిత్‌ భండారిపై సోమవారం అనూజ్‌ బృందం గుంపుతో కలిసి దాడికి దిగింది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 టోర్నీ కోసం స్థానిక సెయింట్‌ స్టీఫెన్స్‌ మైదానంలో సాగుతున్న ఢిల్లీ సీనియర్‌ క్రికెట్‌ జట్టు ప్రాక్టీస్‌ సెషన్‌ను భండారి పరిశీలిస్తుండగా హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు, సైకిల్‌ చైన్లతో దాడికి తెగబడింది. వీరిలో ఒకడు తుపాకీతో బెదిరించాడు. దీంతో భండారి పారిపోయేందుకు యత్నించినా వెంటాడి మరీ కొట్టడంతో తీవ్ర అలజడి రేగింది.

, దేశీయ క్రికెటర్‌పై జీవితకాల నిషేధం