వరదలతో అల్లాడుతున్న ఈశాన్య రాష్ట్రాలు

ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అసోంనుం వరదలు ముంచెత్తుతున్నాయి. ఉగ్రరూపం దాల్చిన బ్రహ్మపుత్ర నదితో వరదలో వేల గ్రామాలు చిక్కుకున్నాయి. అటు బీహార్‌ను సైతం వరదలు వణుకు పుట్టిస్తున్నాయి. అసోం, బీహార్ రాష్ట్రాల్లో 159 మంది మరణించారు. రెండు రాష్ట్రాల్లో కోటి మందికి పైగా నిరాశ్రయులయ్యారు. అసోంలో శనివారం మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు వరదలు, వర్షాల వల్ల చనిపోయినవారి సంఖ్య 62కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే […]

వరదలతో అల్లాడుతున్న ఈశాన్య రాష్ట్రాలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 21, 2019 | 9:42 AM

ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అసోంనుం వరదలు ముంచెత్తుతున్నాయి. ఉగ్రరూపం దాల్చిన బ్రహ్మపుత్ర నదితో వరదలో వేల గ్రామాలు చిక్కుకున్నాయి. అటు బీహార్‌ను సైతం వరదలు వణుకు పుట్టిస్తున్నాయి. అసోం, బీహార్ రాష్ట్రాల్లో 159 మంది మరణించారు. రెండు రాష్ట్రాల్లో కోటి మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

అసోంలో శనివారం మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు వరదలు, వర్షాల వల్ల చనిపోయినవారి సంఖ్య 62కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వర్షాలు తగ్గుముఖం పట్టినా బ్రహ్మపుత్ర, ధన్‌సిరి, జియా భరాలి, కొపిలి నదులు ఉప్పొంగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 3,705 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. 48 లక్షల మందికి పైగా వరదకు నిరాశ్రయులయ్యారు.

బీహార్ వ్యాప్తంగా 12 జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. వరదల వల్ల శనివారం మరో అయిదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 97కి పెరిగింది. కేవలం సీతామడి జిల్లాలోనే 27 మంది మృతి చెందారు. బీహార్‌లోని వాగులు, నదులు ఉప్పొంగుతున్నాయి. నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెరువుల కట్టలు తెగిపోవడంతో గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదలో చిక్కుకున్న వారిని రెస్క్యూ టీం కాపాడుతోంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు వరదలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించింది.

బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్