జహీరాబాద్ పోలీసు స్టేషన్ లో కరోనా కలకలం

కరోనా కట్టడిలో భాగంగా నిబంధనలు అమలు చేస్తున్న అధికారులు సైతం కొవిడ్ రాకాసి బారినపడుతున్నారు. విధులు నిర్వహిస్తున్న పోలీసులు కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు తెలిపారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం సృష్టించింది.

జహీరాబాద్ పోలీసు స్టేషన్ లో కరోనా కలకలం
Follow us

|

Updated on: Jul 27, 2020 | 8:13 PM

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంబిస్తోంది. హైదరాబాద్ తో సహా జిల్లాలకు చాపకిందనీరులా విస్తరిస్తూనే ఉంది. కరోనా కట్టడిలో భాగంగా నిబంధనలు అమలు చేస్తున్న అధికారులు సైతం కొవిడ్ రాకాసి బారినపడుతున్నారు. విధులు నిర్వహిస్తున్న పోలీసులు కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు తెలిపారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం సృష్టించింది. ఎస్ఐతో సహా మరో నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీస్ స్టేషన్ పూర్తిగా శానిటైజ్ చేసిన అధికారులు తిరిగి కార్యకలాపాలు కొనసాగిస్తున్నామన్నారు పోలీసు ఉన్నతాధికారులు. ఇక, పోలీస్ స్టేషన్ సిబ్బందికి కరోనా రావడంతో స్టేషన్‌లోని మిగతా సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్ట్ అయినవారిని ఇప్పటికే హోంక్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇక జిల్లాలో ఇవాళ 98 మంది కరోనా వైరస్ బారిన పడ్డట్లు అధికారులు పేర్కొన్నారు.