‘ స్నేహమేరా జీవితం ‘.. మిత్రుడి కోసం జోలె పట్టారు

అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ఇలా అన్ని బంధాలను ఆ దేవుడే సృష్టిస్తాడు..కానీ, ఒకే ఒక్క బంధాన్ని మాత్రం  మనమే ఎంచుకునే అవకాశం ఇచ్చాడు.. అదే స్నేహం. దేవుడు ఇచ్చిన గొప్ప వరం స్నేహం. ప్రపంచమంతా మనకు దూరమైన..నేనున్నాను అని అంటూ అండగా నిలిచేదే నిజమైన స్నేహం..ఇక్కడ జరిగిన ఓ సంఘటన నిజంగా అసలైన స్నేహనికి అద్దం పడుతుంది. అదేంటో మీరే చదవండి.. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల కేంద్రానికి చెందిన షేక్‌ ఖాజావలి […]

' స్నేహమేరా జీవితం '.. మిత్రుడి కోసం జోలె పట్టారు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 28, 2019 | 6:20 PM

అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ఇలా అన్ని బంధాలను ఆ దేవుడే సృష్టిస్తాడు..కానీ, ఒకే ఒక్క బంధాన్ని మాత్రం  మనమే ఎంచుకునే అవకాశం ఇచ్చాడు.. అదే స్నేహం. దేవుడు ఇచ్చిన గొప్ప వరం స్నేహం. ప్రపంచమంతా మనకు దూరమైన..నేనున్నాను అని అంటూ అండగా నిలిచేదే నిజమైన స్నేహం..ఇక్కడ జరిగిన ఓ సంఘటన నిజంగా అసలైన స్నేహనికి అద్దం పడుతుంది. అదేంటో మీరే చదవండి.. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల కేంద్రానికి చెందిన షేక్‌ ఖాజావలి పదో తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితిల నేపథ్యంలో చదువు అర్థాంతరంగా మానేయాల్సి వచ్చింది. దీంతో రోజువారీ సెంట్రింగ్‌ పనులు చేసుకుంటూ కుటుంబానికి అండగా నిలిచాడు. గతేడాది ఖాజావలీకి వివాహంకాగా..కుటుంబంతో కలిసి జీవితం సాఫిగా సాగిపోతోంది. ఇంతలోనే అనారోగ్యం వెంటాడిండి. అప్పటి వరకు రోజూ పనులకు వెళ్లే ఖాజావలి మంచాన పడ్డాడు. ఖాజావలికి ప్రాణాంతకమైన బోన్‌ మ్యారో వ్యాధీ ఉందని డాక్టర్లు పరీక్షలు చేసి తేల్చారు. చికిత్స అందించేందుకు దాదాపు రూ. 25లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. రోజువారీ కూలీ పనులు చేసుకుని జీవించే ఖాజావలి కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చిపడింది. అతడికి వైద్యం చేయించేందుకు అంత స్థోమత లేకపోవడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. దీంతో అతడ్ని చెన్నైలోని వేలూరు ఆస్పత్రిలో చేర్పించారు. ఖాజావలికి మెరుగైన వైద్యం అందించి తిరిగి అతడు కోలుకోవాలంటే..మెరుగైన చికిత్స తప్పని సరి అని డాక్టర్లు చెప్పారు. మొన్నటి వరకు తమతో కలిసి తిరిగిన స్నేహితుడు ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతుంటే చూసి చలించిపోయారు అతడి స్నేహితులు. ఖాజావలిని కాపాడుకునేందుకు జోలె పట్టారు. స్థానికంగా ఇంటింటికి తిరిగి సాయం అందించాలని కోరుతున్నారు. స్థానికులు కూడా తమకు తోచినంత సాయం అందిస్తున్నారు. ఖాజావలిని ఆదుకోవాలంటూ అటూ సోషల్‌  మీడియాలోనూ స్నేహితులు దాతల సాయం కోరారు. బాధితుడి కుటుంబం సాయం కోసం ఎదురు చూస్తోంది. ఎవరికీ తోచినంత సాయం వారు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఖాజావలికి మెరుగైన వైద్యం అంది..త్వరగా కోలుకోవాలని మనమూ ఆశిద్దాం..

Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్