బాయ్‌ఫ్రెండ్‌ను కలవాలి..పర్మిషన్‌ ప్లీజ్.. షాక్ తిన్న పోలీసులు

హైదరాబాద్‌లో ఓ అమ్మాయి పెట్టుకున్న పర్మిషన్ చూసి.. ఖంగుతిన్నారు. నవ్వాలో లేక ఏడ్వాలో అర్ధం కానీ పరిస్థితి తెలెత్తేలా అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే అనుమతి ఉండి.. అత్యవసరమైన పరిస్థితుల్లోనే అధికారులు ఇతర ప్రాంతాలకు అనుమతులిస్తున్నారు. అయితే బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ విచిత్రమైన కేసు వచ్చిపడింది. సోమవారం ఉదయం.. పీఎస్‌కు వచ్చిన ఓ యువతి.. సార్‌.. నా బాయ్‌ఫ్రెండ్‌ను చూడాలని ఉంది.. దయచేసి […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:17 pm, Tue, 7 April 20

హైదరాబాద్‌లో ఓ అమ్మాయి పెట్టుకున్న పర్మిషన్ చూసి.. ఖంగుతిన్నారు. నవ్వాలో లేక ఏడ్వాలో అర్ధం కానీ పరిస్థితి తెలెత్తేలా అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే అనుమతి ఉండి.. అత్యవసరమైన పరిస్థితుల్లోనే అధికారులు ఇతర ప్రాంతాలకు అనుమతులిస్తున్నారు. అయితే బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ విచిత్రమైన కేసు వచ్చిపడింది. సోమవారం ఉదయం.. పీఎస్‌కు వచ్చిన ఓ యువతి.. సార్‌.. నా బాయ్‌ఫ్రెండ్‌ను చూడాలని ఉంది.. దయచేసి వెళ్ళేందుకు పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్‌ అంటూ వచ్చిందట. అయితే ఆ అమ్మాయి రిక్వెస్ట్‌ చూసిన పోలీసులు ఖంగుతిన్నారు.

అయితే అంతకు ముందు రోజు.. అమ్మాయి ఉన్న ప్రాంతానికి ఆమె ప్రేమిస్తున్న యువకుడు వచ్చాడట. ఆదివారం ఉదయం అంబర్‌పేట నుంచి.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్ 12కు వచ్చాడు. అయితే ఆ యువకుడిని గమనించిన స్థానికులు.. ఆ యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో ఆ అమ్మాయి పేరెంట్స్ తమ అమ్మాయిని వేధిస్తున్నాడని ఆరోపణలు చేస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే సదరు అమ్మాయి మీద తనకు ఎలాంటి ఇష్టం లేదని.. ఆ విషయం చెప్పేందుకే వచ్చానని పోలీసులముందు చెప్పి.. వెళ్లిపోయాడు.అయితే ఆ మరుసటి రోజు.. సదరు అమ్మాయి.. తన బాయ్‌ఫ్రెండ్‌ను మీట్‌ అవ్వాలని.. అందుకు మీరు పర్మిషన్ ఇవ్వాలంటూ పోలీస్ స్టేషన్ మెట్టెక్కింది. అయితే పోలీసులు ఆ అమ్మాయికి సర్ధి చెప్పి మెల్లిగా ఇంటికి పంపించేశారు.