Breaking News
  • ఆదిలాబాద్‌: నేటి నుంచి నాగోబా జాతర. ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్‌లో ప్రారంభంకానున్న జాతర. జాతరకు రానున్న తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ఆదివాసీలు, గిరిజనులు.
  • అవినీతి సూచిలో భారత్‌కు 80వ స్థానం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై వ్యాపారవర్గాలు నుంచి.. వివరాలు సేకరించిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ. అవినీతి కట్టడిలో తొలిస్థానంలో నిలిచిన డెన్మార్క్‌, న్యూజిలాండ్‌.
  • వలసల నియంత్రణకు ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక చర్య. అమెరికా వచ్చే విదేశీ గర్భిణులపై ఆంక్షలు విధింపు. కాన్పు కోసమే అమెరికా వచ్చేవారికి పర్యాటక వీసా నిరాకరణ.
  • రోహింగ్యాల ఊచకోతపై అంతర్జాతీయ న్యాయస్థానం సంచలన తీర్పు. మయన్మార్‌లో రోహింగ్యాల నరమేధం జరిగింది. సైన్యం అండతో రోహింగ్యాలను ఊచకోత కోశారన్న న్యాయస్థానం. రోహింగ్యాలను రక్షించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం.
  • కరోనా వైరస్‌కు కారణం పాములే. చైనా అధ్యయనంలో వెల్లడి. ఐదు నగరాలకు రాకపోకలన్నీ నిలిపివేసిన చైనా. వుహాన్‌, హుయాంగ్‌గాంగ్‌, ఎఝౌ, ఝిజియాంగ్‌.. ఖియాన్‌జింగ్‌ నగరాలపై రవాణా ఆంక్షలు విధింపు.

లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఆ హీరోయిన్‌తో కమల్ డేటింగ్..?

Kamal Haasan dating Tamil Heroine, లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఆ హీరోయిన్‌తో కమల్ డేటింగ్..?

లోకనాయకుడు కమల్‌హాసన్ గురువారం 65వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు. కుటుంబ సభ్యులతో సహా తన స్వగ్రామం పారమకుడికి వెళ్లిన కమల్.. అక్కడ తన తండ్రి శ్రీనివాసన్ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో కమల్ తనయలిద్దరు సందడి చేశారు. వారితో పాటు కమల్ సోదరుడు చారు హాసన్, ఆయన కుమార్తె సుహాసిని మణిరత్నం కూడా కమల్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. అయితే ఆ ఫొటోలో కమల్ ఫ్యామిలీతో పాటు యంగ్ హీరోయిన్ పూజా కుమార్ కూడా ఉండటం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Kamal Haasan dating Tamil Heroine, లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఆ హీరోయిన్‌తో కమల్ డేటింగ్..?

కాగా కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం’, ‘విశ్వరూపం 2’, ‘ఉత్తమ విలన్’ మూడు చిత్రాల్లోనూ పూజా కుమార్ నటించింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు కమల్‌తో గౌతమి విడిపోయిన సమయంలోనూ పూజా కుమార్ పేరు వినిపించింది. ఆమెతో కమల్‌కు ఉన్న సాన్నిహిత్యం కారణంగానే గౌతమి, అతడితో విడిపోయినట్లు పుకార్లు వినిపించాయి. ఇక ఇటీవల విక్రమ్ హీరోగా కమల్ నిర్మించిన ‘కదరమ్ కోండ్రన్’ స్పెషల్ స్క్రీనింగ్‌లోనూ ఆమె లోకనాయకుడితో కలిసి కనిపించింది. ఇక తాజాగా హాసన్ ఫ్యామిలీ ఫొటోలో కూడా ఆమె ఉండటంతో.. కమల్‌, పూజా మధ్య ఏమైనా నడుస్తుందా..? అన్న చర్చ కోలీవుడ్‌లో జరుగుతోంది. మరి నిజంగానే వారిద్దరి మధ్య సంబంధం ఉందా..? హాసన్ ఫ్యామిలీ ఫొటోలో పూజా ఎందుకు ఉంది..? ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానం కావాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా పూజా కుమార్ తెలుగులో రాజశేఖర్ సరసన ‘పీవీఎస్ గరుడ వేగ’లో కనిపించిన విషయం తెలిసిందే.