ఆజంఖాన్‌పై చర్యలకు స్మృతి ఇరానీ డిమాండ్

ఎంపీ ఆజమ్‌ఖాన్ వ్యాఖ్యలపై బీజేపీ మహిళా ఎంపీలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఆజమ్ ఖాన్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ మహిళా ఎంపీ రమాదేవిపై ఆజమ్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు సభలో పెద్దఎత్తున నిరసన తెలిపారు. “పనిచేసే ప్రదేశంలో మహిళలు లైంగిక వేధింపులకు గురికాకుండా చూసే బిల్లును ఆమోందించారు. కానీ ఇదే సభలో ఓ ఎంపీ .. మరో మహిళా ఎంపీపై అసభ్యకర వ్యాఖ్యాలు చేయడం దేశమంతా చూసింది. మనం చూస్తూ […]

ఆజంఖాన్‌పై చర్యలకు స్మృతి ఇరానీ డిమాండ్
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2019 | 2:12 PM

ఎంపీ ఆజమ్‌ఖాన్ వ్యాఖ్యలపై బీజేపీ మహిళా ఎంపీలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఆజమ్ ఖాన్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ మహిళా ఎంపీ రమాదేవిపై ఆజమ్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు సభలో పెద్దఎత్తున నిరసన తెలిపారు. “పనిచేసే ప్రదేశంలో మహిళలు లైంగిక వేధింపులకు గురికాకుండా చూసే బిల్లును ఆమోందించారు. కానీ ఇదే సభలో ఓ ఎంపీ .. మరో మహిళా ఎంపీపై అసభ్యకర వ్యాఖ్యాలు చేయడం దేశమంతా చూసింది. మనం చూస్తూ ఉరుకోకూడదు. ఇదే వ్యాఖ్యాలు బయట చేస్తే పోలీసులు అరెస్టు చేస్తారు”.. అంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఆజంఖాన్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ కూడా ఖండించింది. మహిళలపై అగౌరవంగా మాట్లాడినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.