ఖమ్మం జిల్లాలో దారుణం.. అగ్నికి అహుతి అయిన పంటపొలాలు.. 50 ఎకరాల్లో మొక్కజోన్న, కంది పంట నష్టం

రైతు ఆరుగాలం కష్టించి పండించిన పండించిన పంట కళ్ళముందే అగ్నికి ఆహుతి అయ్యింది.

ఖమ్మం జిల్లాలో దారుణం.. అగ్నికి అహుతి అయిన పంటపొలాలు.. 50 ఎకరాల్లో మొక్కజోన్న, కంది పంట నష్టం
Follow us

|

Updated on: Jan 11, 2021 | 6:31 AM

ఖమ్మం జిల్లాలో సంభవించిన అగ్ని ప్రమాదం రైతు కంట కన్నీట మిగిల్చింది. రైతు ఆరుగాలం కష్టించి పండించిన పండించిన పంట కళ్ళముందే అగ్నికి ఆహుతి అవుతుండగా కాపాడుకునే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మామిడి గుండాల లో జరిగింది.

ఇల్లందు మండలం మామిడి గుండాల లో ఈరోజు రైతుల పంట చేల లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. 200 కింటాళ్ల మొక్కజొన్న కంకులు, 10 ఎకరాల ఎకరాల కంది చేను పూర్తిగా కాలిబూడిదయ్యాయి. 50 ఎకరాలల్లో నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఘటన స్థలానికి చేరుకొని రైతులను ఓదార్చి .. పంటలను పరిశీలించారు. అనంతరం పంటనష్టాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎం వి రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.