జగన్ ఇంటి వద్ద ధర్నాకు దిగిన ఆశావాహులు

హైదరాబాద్ లోటస్ పాండ్ దగ్గర కాస్త ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్ నివాసం దగ్గరకు వచ్చిన పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌ను లోపలకు పంపలేదు. దాదాపు 2 గంటలుగా ఆయన తన కుటుంబంతో గేటు బయటే వెయిట్ చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూసినా పట్టించుకోకపోవడంతో సునీల్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. మరోవైపు.. వైసీపీలో సీట్ల చిచ్చు రేగింది. ఉదయం నుంచి జగన్ నివాసం దగ్గర ఆశావాహులంతా ధర్నాకు దిగారు. ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:29 pm, Tue, 12 March 19

హైదరాబాద్ లోటస్ పాండ్ దగ్గర కాస్త ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్ నివాసం దగ్గరకు వచ్చిన పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌ను లోపలకు పంపలేదు. దాదాపు 2 గంటలుగా ఆయన తన కుటుంబంతో గేటు బయటే వెయిట్ చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూసినా పట్టించుకోకపోవడంతో సునీల్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.

మరోవైపు.. వైసీపీలో సీట్ల చిచ్చు రేగింది. ఉదయం నుంచి జగన్ నివాసం దగ్గర ఆశావాహులంతా ధర్నాకు దిగారు. ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసి.. ధర్నా చేశారు. ఉరవకొండ టికెట్ ను శివరామిరెడ్డికి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి కాన్వాయ్ ను అడ్డుకుని నినాదాలు చేశారు.