వర్క్‌ ఫ్రమ్ హోమ్‌ కొనసాగే అవకాశం ఉంది: బిల్‌గేట్స్‌

కరోనా లాక్‌డౌన్ వేళ పలు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్‌ని ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో ఎక్కువగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నాయి.

వర్క్‌ ఫ్రమ్ హోమ్‌ కొనసాగే అవకాశం ఉంది: బిల్‌గేట్స్‌
Follow us

| Edited By:

Updated on: Sep 25, 2020 | 12:26 PM

Work From Home: కరోనా లాక్‌డౌన్ వేళ పలు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్‌ని ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో ఎక్కువగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నాయి. ఇక లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా మిగిలిన పలు కంపెనీలు తిరిగి కార్యాలయాల్లో తమ పనులను ప్రారంభించాయి. అయితే ఐటీ కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌నే పెట్టాయి. ఇదిలా ఉంటే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ని ఇలానే కొనసాగిస్తే ఇబ్బందులే తలెత్తే అవకాశం ఉందని పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వర్క్ ఫ్రమ్ హోమ్‌ సంస్కృతి బాగా పనిచేసిందని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి తొలిగిపోయిన తరువాత కూడా పలు కంపెనీలు ఈ విధానాన్ని కొనసాగించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ”కరోనా నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలైంది. దీంతో కంపెనీలు వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ని ఇచ్చాయి. ఈ మహమ్మారి ముగిసిన తరువాత ఆఫీసుల్లో ఉద్యోగులు ఎంత సమయం వెచ్చించాలన్న దానిపై కంపెనీలు పునరాలోచించుకోవాలి” అని వెల్లడించారు.

అయితే వర్క్ ఫ్రమ్‌ కోసం సాఫ్ట్‌వేర్ మరింత మెరుగవ్వాలని, చిన్న పిల్లలు ఉన్నా, ఇల్లు చిన్నదైనా, పనులున్నా విధులకు కష్టమని.. అలాగే మహిళలు అయితే వారు చేసేందుకు చాలా పనులుంటాయి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయి అని బిల్‌గేట్స్ తెలిపారు.

Read More:

నా పేరు మీదున్నా ప్రాపర్టీ కూడా ఇచ్చేశా.. అయినా వదల్లేదు: హేమంత్ భార్య

నోబెల్‌ విజేతలకు పెరిగిన నగదు బహుమతి