నోబెల్‌ విజేతలకు పెరిగిన నగదు బహుమతి

ప్రతిష్టాత్మక నోబెల్‌ పురస్కారం నగదు బహుమతిపై ఆ ఫౌండేషన్ కీలక ప్రకటన చేసింది. ఈసారి విజేతలకు ఇచ్చే నగదు బహుమతిని

నోబెల్‌ విజేతలకు పెరిగిన నగదు బహుమతి
Follow us

| Edited By:

Updated on: Sep 25, 2020 | 11:04 AM

Nobel Cash prize: ప్రతిష్టాత్మక నోబెల్‌ పురస్కారం నగదు బహుమతిపై ఆ ఫౌండేషన్ కీలక ప్రకటన చేసింది. ఈసారి విజేతలకు ఇచ్చే నగదు బహుమతిని 1 మిలియన్ క్రౌన్లు పెంచుతున్నట్లు ఫౌండేషన్ వెల్లడించింది. దీంతో ఇకపై ఈ బహుమతికి ఎంపికయ్యే విజేతలు 10 మిలియన్ క్రౌన్లు(అంటే దాదాపుగా రూ.3కోట్లు) పొందుతారని నోబెల్‌ ఫౌండేషన్ అధ్యక్షుడు లార్స్ హీకెన్‌స్టెన్ తెలిపారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఫౌండేషన్ ఖర్చులు, మూలధనం స్థిరంగా ఉందని, అందుకే నగదును పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక ఈ ఏడాదికి సంబంధించి అక్టోబర్‌లో విజేతలను ప్రకటించనున్నారు.

కాగా 1901లో ప్రముఖ రసాయనవేత్త ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ ఈ బహుమతులను ప్రారంభించారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, శాంతి, సాహిత్యం, వైద్య, ఆర్థిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ బహుమతిని ఇస్తారు. భారత్‌లో ఇప్పటివరకు రవీంద్రనాథ్ ఠాగూర్, సీవీ రామన్‌, మదర్ థెరిసా, అమర్త్యసేన్‌, కైలాష్‌ సత్యార్థి, అభిజిత్ బెనర్జీ వివిధ విభాగాల్లో నోబెల్‌ బహుమతిని అందుకున్నారు. అలాగే భారత్‌లో జన్మించిన హర గోవింద్ ఖురానా, సుబ్రమణ్యం చంద్రశేఖర్, వెంకట్రామన్ రామకృష్ణన్‌ నోబెల్‌ బహుమతులను అందుకున్నారు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,381 కొత్త కేసులు.. 10 మరణాలు

Bigg Boss 4: హీట్ పెంచేందుకు వచ్చిన హాట్ బ్యూటీ.. ఎవరో తెలుసా!