మోల్డోవా అనే యూరోపియన్ దేశంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. 62 ఏళ్ల వృద్ధుడిని ఓ వ్యక్తి బ్రతికుండగానే మట్టిలో పూడ్చిపెట్టారు. నాలుగు రోజుల పాటు భూమిలోనే ఉన్న ఆ వృద్ధుడిని పోలీసులు అనూహ్యంగా బయటకు తీసుకొచ్చి ప్రాణం పోశారు. ఈ షాకింగ్ ఘటన ఈ నెల 13న మోల్డోవాలోని ఉస్టియా(Ustia) అనే గ్రామంలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..
మోల్డోవాలో 74 ఏళ్ల మహిళ హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. సదరు మహిళ ఇంట్లోనే కిరాతకంగా హత్యకు గురైంది. మహిళ హత్య జరిగినప్పటి నుంచి భర్త ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు మృతురాలి భర్త కోసం గాలించడం ప్రారంభించారు. దీనిలో భాగంగా పోలీసులు మహిళ ఇంటికి చేరుకోగా.. ఇంటి నేల కింద నుంచి వస్తున్న మూలుగులు, కేకలు విన్నారు. దీంతో వెంటనే వారు అక్కడ తవ్వకాలు చేపట్టారు.
అలా తవ్వుతుంటే నేల కింద ఉన్న తాత్కాలిక నేలమాళిగ వారికి కనిపించింది. లోపలికి వెళ్లి చూడగా అక్కడ బతికున్న 62 ఏళ్ల వ్యక్తి వారికి కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. అతను స్పృహలో ఉన్నప్పటికీ అతని మెడ, ముఖంపై గాయాల గుర్తులు కనిపించాయి. నాలుగు రోజులుగా అతను అక్కడ చిక్కుకుపోయినట్లు గుర్తించారు. తన బంధువైన 18 ఏళ్ల యువకుడు ఒకడు తనని ఇలా పూడ్చేశాడని తెలిపాడు. ఈ ఘటన మే 18వ తేదీ రాత్రి జరిగినట్లు వృద్ధుడు తెలిపాడు. ఆ రోజు రాత్రి వృద్ధుడు, యువకుడు కలిసి మద్యం సేవించారు. అయితే వారి మధ్య గొడవ జరిగడంతో యువకుడు వృద్ధుడిపై కత్తితో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని యువకుడు బేస్మెంట్లో బంధించి, దాని ముఖద్వారాన్ని మట్టితో కప్పివేశాడు.
🚨BREAKING: A 62-year-old man in Moldova was found alive after being buried for four days.
Police discovered him while investigating the murder of a 74-year-old woman, when they heard noises from the ground near her house.
Digging at the site, they uncovered a makeshift grave… pic.twitter.com/TEn1e9Shwo
— Apex Episodes (@ApexEpisodes) May 16, 2024
ఆ తర్వాత సదరు యువకుడు వృద్ధుడి భార్యను కూడా హత్య చేశాడు. హత్య జరిగిన విషయం బయటికి పొక్కడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలా మహిళ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సమయంలో వృద్ధుడి ఆచూకీ లభ్యమైంది. దీంతో పోలీసులు ఇంతటి దారుణానికి ఒడిగట్టిన యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ కేసులో నేరం రుజువైతే నిందితుడికి జీవితకాల ఖైదు విధించే అవకాశం ఉంది. ఈ ఘటన వృద్ధులపై జరుగుతున్న హింసను వెలుగులోకి తెచ్చింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.