ముక్కులోంచి రక్తం.. వాంతులు.. మదురో నిర్భందం వేళ ఆమెరికా వాడిన ఆయుధమేంటి?

అమెరికా సైన్యం వెనిజులాపై మెరుపు దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడైన నికోలస్ మదురోను ఎత్తుకెళ్లిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన విషయం అందిరికీ తెలిసిందే.. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆపరేషన్ చేసేందుకు ఆమెరికా సైన్యం అత్యంత శక్తవంతమైన ఆయుధాన్ని ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఇంతకు ఆమెరికా వాడిన ఆ ఆయుధం ఏంటో తెలుసుకుందాం పదండి.

ముక్కులోంచి రక్తం.. వాంతులు.. మదురో నిర్భందం వేళ ఆమెరికా వాడిన ఆయుధమేంటి?
Us Venezuela Attack (1)

Updated on: Jan 12, 2026 | 12:55 PM

జనవరి 3 వెనిజులాపై అమెరికా సైన్యాలు దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని ఎత్తుకెళ్లిన ఘటన యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే వందలాది మంది వెనిజులా సైన్యాన్ని కేవలం పదుల సంఖ్యలో వచ్చిన అమెరికన్ సైన్యాలు ఎలా నిర్వీర్యం చేయగలిగాయనేది తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ క్రమంలోనే వెనిజులాపై అమెరికా చేసిన దాడికి సంబంధించిన నికోలస్ మదురో దగ్గర పనిచేస్తున్న భద్రతా సిబ్బంది సంచలన విషయాన్ని బయటపెట్టాడు. అధ్యక్షుడి భవనంలోకి చొరబడిన ఆమెరికన్ సైన్యాలు కేవలం నిమిషాల వ్యవధిలోనే తమ ఆపరేషన్‌ను ముగించినట్టు తెలిపారు.

మునుపెన్నడూ చూడని ఆయుధాన్ని ఉపయోగించిన ఆమెరికా

ఈ దాడిలో వెనిజులా రక్షణ సిబ్బంది సామర్థ్యాన్ని దెబ్బతీసేందకు అమెరికా అత్యంత పవర్‌ఫుల్ ఆయుధాన్ని ఉపయోగించినట్టు తెలిపారు. తాము అధ్యక్ష భవనంలో మదురోకు రక్షణగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా తమ రాడార్‌ వ్యవస్థలు పనిచేయడం ఆగిపోయినట్టు అతను తెలిపారు. అక్కడ ఏం జరిగిందో తమకెవ్వరికీ అర్థం కాలేదన్నారు. ఇంతలోని భవనంలోకి దూసుకొచ్చిన కొన్ని డ్రోన్స్‌ తమపై దాడికి ప్రయత్నించాయన్నారు. వాటిని ఎలా ఎదుర్కోవాలో తమకు అర్థం కాలేదన్నారు.

ఉన్నట్టుండి ముక్కులోంచి రక్తం 

ఆ వెంటనే 8 హెలికాప్టర్లలో వచ్చిన 20 మంది సైనికులు సంఘటా స్థలాన్ని మొత్తం తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్టు తెలిపారు. పరిస్థితులను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు అమెరికన్ సైన్యాలు మునుపెన్నడూ చూడని కొత్త ఆయుధాలను ప్రయోగించారన్నారు. ఆ వెంటనే ఏవో ధ్వనితరంగాల వంటి శబ్ధాలు తమను తీవ్ర ఇబ్బందికి గురిచేశాయన్నారు. ఈ దాడి ధాటికి తమ తలపగిలిపోతున్నట్టు అనిపించడంతో పాటు ముక్కులోంచి రక్తం వచ్చినట్టు అ గార్డ్ చెప్పుకొచ్చాడు. కొందరైతే అక్కడికక్కడే వాంతులు చేసుకొని నేలపై కూలిపోయారని తెలిపారు. అందుకే మేం 100 మంది ఉన్నా వాళ్లను ఏం చేయలేకపోయామని తెలిపారు. అగ్రరాజ్యంతో పెట్టుకొని గెలవడమనేది భ్రమలాంటిదేనని.. అతను చెప్పిన వివరాలు న్యూయార్క్‌ పోస్ట్‌లో ప్రచురితమయ్యాయి.

గతంలోనూ ఇటాంటి దాడే చేసిన చైనా

అయితే ఈ పోస్ట్‌ వైరల్ కావడంతో దీనిపై అమెరికా నిఘా విభాగంలో పనిచేసిన సీనియర్ అధికారి స్పందిస్తూ ఇలా అన్నారు. ఆ గార్డ్ చెప్పిన వివరాలను బట్టి చూస్తే అమెరికా సైన్యం ఈ ఆపరేషన్‌లో “మైక్రోవేవ్స్, లేజర్స్‌” వంటి వాటిని ఉపయోగించి ఉండవచ్చని తెలిపారు. మరోవైపు ఇదో సోనిక్‌ ఎటాక్ అని కూడా కొందరు ఆరోపిస్తున్నారు. అయితే గతంలో చైనా- భారత్‌ మధ్య జరిగిన గల్వాన్ ఎటాక్ సమయంలో కూడా చైనా సైన్యం భారత్‌పై ఇదే తరహాలో మైక్రో వేవ్‌ ఆయుధాలను వాడిందనే ఆరోపణలు ఉన్నప్పటికీ.. చైనా మాత్రం వాటిని ఖండించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.