డిమాండ్ ఎక్కువగా ఉన్నా.. అమెరికా వెళ్లేందుకు అత్యవసర వీసాలను జారీ చేయలేమని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ మంగళవారం స్పష్టం చేసింది. పర్యాటకులు ఇప్పుడు అన్ని కేటగిరీల వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని.. అయితే వేచిచూసే సమయంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదని వెల్లడించింది. వీసా సంబంధిత అంశాలను నివృత్తి చేసుకునేందుకు యూఎస్ దౌత్య వ్యవహారాల మంత్రి డాన్ హెఫ్లిన్ ఈ నెల 29న మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక ఫేస్‌బుక్ పేజీ ద్వారా ప్రశ్నలు అడగవచ్చని పేర్కొంది.
అమెరికా వీసా దరఖాస్తు చేసుకున్న వారికి కొన్ని కేటగిరిల వీసాల విషయంలో ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఇంటర్వ్యూలు రద్దు చేసేందుకు అమెరికా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యూఎస్ విదేశాంగ శాఖ కాన్సులార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎఫ్, హెచ్ 1, హెచ్ 3, హెచ్ 4, నాన్ బ్లాంకెట్ ఎల్, ఎం, ఓ, పీ, క్యూ వీసాలకు దరఖాస్తు చేసుకున్న వారితో పాటు అకాడమి జే వీసా దరఖాస్తు దారులకు కూడా ఈ మినహాయింపు వర్తించనుంది. అయితే వీరు గతంలో ఏ రకమైన వీసా జారీ చేసినా, వారు తమ జాతీయత లేదా నివాస దేశం నుంచి వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే మునుపటి తిరస్కరణను కలిగి ఉన్న దరఖాస్తుదారులకు ఇది వర్తించదు. దరఖాస్తుదారుల నుంచి అదనపు సమాచారం అవసరమైతే న్యాయనిర్ధేత కాన్సులర్ అధికారులు వ్యక్తిగత ఇంటర్వ్యూని అభ్యర్తించవచ్చు. అయితే తమ వీసా గడువు ముగిసిన 48 గంటల్లోపే రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎంబసీ ఈనెల నుంచి వ్యక్తిగతంగా B1, B2 వీసా అపాయింట్‌మెంట్‌ల ప్రక్రియ తిరిగి ప్రారంభించింది.
ఇక వీసా అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్న వారికీ మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై కాన్సులార్ కార్యాలయ్యాల్లో దరఖాస్తు చేసుకున్న వారికి అపాయింట్ దొరకడం ఆలస్యం అవుతుందని అమెరికా అధికారులు తెలిపారు. త్వరగా వీసా అపాయింట్‌మెంట్ కావాలంటే యూఎస్ ఎంబసీ వెబ్‌సైట్ ప్రకారం.. ఎక్స్‌పిడైటెడ్ అపాయింట్‌మెంట్ కోసం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అపాయింట్‌మెంట్ స్లాట్లు చాలా తక్కువ పరిమితిలో ఉండటంతో ఒక వేళం అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లభించిన పక్షంలో ఈమెయిల్ ద్వారా సమాచారం అందిస్తారని అమెరికా అధికారులు తెలిపారు. అలాగే ఇప్పటికే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఎంబసీ కీలక ప్రకటన వెల్లడించింది. వారి చెల్లింపుల కాలపరిమితి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.
కరోనావైరస్ మహమ్మారి తర్వాత పరిమితులను సడలించడం, అంతర్జాతీయ విమానాల క్రమబద్ధీకరణ కారణంగా, చాలా మంది భారతీయులు ప్రస్తుతం విదేశాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, USకి సందర్శకుల వీసాను పొందేందుకు వ్యక్తులు ఇప్పుడు రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం వేచి ఉండవలసి ఉంటుంది. నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా కోసం వెయిటింగ్ పీరియడ్ వివిధ భారతీయ నగరాలకు, వివిధ వీసా వర్గాలకు భిన్నంగా ఉంటుంది.
భారతదేశం అంతటా కాన్సులర్ విభాగాలలో ప్రస్తుత ఆపరేటింగ్ స్టేటస్, వీసా ప్రాసెసింగ్‌పై సెప్టెంబర్ 29న మధ్యాహ్నం 3 గంటలకు మినిస్టర్ కాన్సులర్ అఫైర్స్ డాన్ హెఫ్లిన్ హోస్ట్ చేసే Facebook, Instagram లైవ్ సెషన్‌లో చేరాలని వీసా దరఖాస్తుదారులను US మిషన్ టు ఇండియా ఆహ్వానించింది. నాన్-ఇమిగ్రెంట్ వీసా వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు 2 సంవత్సరాలు మించిపోయింది. సెప్టెంబరు 27న ఢిల్లీలో రోజు ముగిసే సమయానికి విజిటర్ వీసాల కోసం వెయిటింగ్ పీరియడ్ 833 క్యాలెండర్ రోజులు ఉంది. కొన్ని ప్రాంతాలకు తక్కువగా వెయిటింగ్ పిరియడ్స్ ఉంటే మరి కొన్ని ప్రాంతాలకు ఎక్కువగా ఉంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి