Container Ships: సముద్ర మార్గంలో పండ్లు, కూరగాయలతో వెళ్తున్న 10 కంటైనర్లు.. అనుమానంతో తెరచి చూడగా షాకింగ్ సీన్‌!

|

Jun 18, 2024 | 12:01 PM

జర్మనీలో భారీ మొత్తంలో డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. ఏకంగా రూ.23 వేల కోట్ల విలువైన కొకైన్‌ పట్టుబడింది. కంటైనర్లలో పట్టుబడ్డ టన్నుల కొద్ది కొకైన్‌ సీజ్‌ చేసి చేసినట్లు జర్మన్‌ ఇన్వెస్టగేటర్లు సోమవారం మీడియాకు తెలిపారు. జర్మనీ దేశంలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ పట్టుబడటం ఇదే తొలిసారి అని వారు తెలిపారు. గతేడాది కొలంబియా అధికారుల సూచనల మేరకు 35.5 మెట్రిక్‌ టన్నుల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డ్యూసెల్‌డార్ఫ్‌..

Container Ships: సముద్ర మార్గంలో పండ్లు, కూరగాయలతో వెళ్తున్న 10 కంటైనర్లు.. అనుమానంతో తెరచి చూడగా షాకింగ్ సీన్‌!
Container Ships With Cocaine
Follow us on

బెర్లిన్‌, జూన్‌ 18: జర్మనీలో భారీ మొత్తంలో డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. ఏకంగా రూ.23 వేల కోట్ల విలువైన కొకైన్‌ పట్టుబడింది. కంటైనర్లలో పట్టుబడ్డ టన్నుల కొద్ది కొకైన్‌ సీజ్‌ చేసి చేసినట్లు జర్మన్‌ ఇన్వెస్టగేటర్లు సోమవారం మీడియాకు తెలిపారు. జర్మనీ దేశంలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ పట్టుబడటం ఇదే తొలిసారి అని వారు తెలిపారు. గతేడాది కొలంబియా అధికారుల సూచనల మేరకు 35.5 మెట్రిక్‌ టన్నుల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డ్యూసెల్‌డార్ఫ్‌ నగరంలోని ప్రాసిక్యూటర్లు తెలిపారు.

అలాగే హాంబర్గ్‌లోని ఓడరేవులో 25 టన్నుల కొకైన్, డచ్ పోర్ట్ రోటర్‌డామ్‌లో మరో 8 టన్నులు, కొలంబియాలో దాదాపు 3 టన్నుల కొకైన్‌ను వారు సీజ్‌ చేశారు. వీటిని కంటైనర్లలో కూరగాయలు, పండ్ల మధ్య దాచి దేశం దాటిస్తుండగా పట్టుబడినట్లు తెలిపారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో జర్మనీలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు గతంలో ఆ దేశ ప్రభుత్వం ప్రకటించలేదు. 2023లో జర్మనీ, బల్గేరియా తదితర దేశాలకు చెందిన నిందితులు లాటిన్‌ అమెరికా నుంచి యూరప్‌ దేశాలకు గత ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు మధ్యలో కొకైన్‌ను పెద్ద ఎత్తున తరలించేందుకు యత్నించినట్లు అధికారులు తెలిపారు.

తాజాగా పట్టుబడిన ఘటనలో ఏడుగురిని అరెస్ట్‌ చేశామని అధికారులు తెలిపారు. నిందితుల వయసు 30 నుంచి 54 సంవత్సరాల మధ్య ఉంటుంది. వీరు జర్మన్, అజర్‌బైజాన్, బల్గేరియన్, మొరాకో, టర్కిష్, ఉక్రెయిన్ దేశాలకు చెందిన వారిగా ప్రాసిక్యూటర్లు ఒక ప్రకటనలో తెలిపారు. వారి గుర్తింపును జర్మన్ గోప్యతా నిబంధనల మేరకు వెల్లడించడం లేదని అధికారులుతెలిపారు. వీరు కొకైన్‌తో 10 సముద్ర కంటైనర్‌లను రవాణా చేసినట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు. నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియా రాష్ట్ర న్యాయ మంత్రి బెంజమిన్ లింబాచ్.. డ్యూసెల్‌డార్ఫ్‌లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ భారీ కొకైన్ సీజ్‌ చేసిన అధికారులను ప్రశంసించారు. అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలకు చెక్‌ పెట్టేలా అధికారులు వ్యవహరించారంటూ కొనియాడారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.