ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది.

వరల్డ్‌ వైడ్‌గా 95వేల మందికి పైగా ఈ ప్రాణంతక మహమ్మారి బారిన పడ్డారు. మొత్తం 3,283మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ పుట్టిన చైనాలో ఇప్పటివరకు 3,012మంది మృతి చెందారు. మరో 80 వేల మందికి పైగా వైరస్‌ సోకినట్లు గుర్తించారు. ఐతే చైనాలో కాస్త శాంతించిన కోవిడ్‌..చైనాయేతర దేశాలను కబళిస్తోంది. ఇటలీలో 107 మంది, ఇరాన్‌లో 92 మంది కరోనా కాటుకు బలయ్యారు. సౌత్‌ కొరియాలో మృతుల సంఖ్య 35కు చేరింది. ఇక అగ్రరాజ్యం అమెరికాలోనూ కరోనా […]

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది.
Follow us

|

Updated on: Mar 05, 2020 | 10:59 AM

వరల్డ్‌ వైడ్‌గా 95వేల మందికి పైగా ఈ ప్రాణంతక మహమ్మారి బారిన పడ్డారు. మొత్తం 3,283మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ పుట్టిన చైనాలో ఇప్పటివరకు 3,012మంది మృతి చెందారు. మరో 80 వేల మందికి పైగా వైరస్‌ సోకినట్లు గుర్తించారు. ఐతే చైనాలో కాస్త శాంతించిన కోవిడ్‌..చైనాయేతర దేశాలను కబళిస్తోంది. ఇటలీలో 107 మంది, ఇరాన్‌లో 92 మంది కరోనా కాటుకు బలయ్యారు. సౌత్‌ కొరియాలో మృతుల సంఖ్య 35కు చేరింది.

ఇక అగ్రరాజ్యం అమెరికాలోనూ కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. 129 మందికి కోవిడ్‌ సోకగా..ఇప్పటివరకు 11మంది మృతి చెందారు. జపాన్‌లో ఆరుగురు, ఫ్రాన్స్‌లో నలుగురు, స్పెయిన్‌లో ఒకరు హాంకాంగ్‌లో ఇద్దరిని బలి తీసుకుంది ఈ ప్రాణాంతక మహమ్మారి. ఇక అర్జెంటీనాలో తొలి కేసు నమోదైంది.