ములుగు జిల్లా : మహిళా ఎంపీటీసీ ఆత్మహత్య

ములుగు జిల్లాలో ఓ మహిళా ఎంపీటీసీ సభ్యురాలు సూసైడ్ చేసుకున్న‌ ఘటన కలకలం రేపింది. జిల్లాలోని ములుగు మండలం జంగాలపల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు ముడతనపెల్లి స్వరాజ్యం ఈ నెల 21న త‌న ఇంట్లోనే పురుగుల మందు తాగింది. దీంతో వెంట‌నే ఆమెను ములుగు గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రికి తరలించి ట్మీట్మెంట్ అందించారు. కానీ పరిస్థితి విషమించడంతో అక్క‌డ్నుంచి హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, అనంత‌రం హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రి డాక్ట‌ర్లు ఎంత ప్ర‌య‌త్నం […]

ములుగు జిల్లా : మహిళా ఎంపీటీసీ ఆత్మహత్య
Follow us

|

Updated on: Apr 24, 2020 | 2:54 PM

ములుగు జిల్లాలో ఓ మహిళా ఎంపీటీసీ సభ్యురాలు సూసైడ్ చేసుకున్న‌ ఘటన కలకలం రేపింది. జిల్లాలోని ములుగు మండలం జంగాలపల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు ముడతనపెల్లి స్వరాజ్యం ఈ నెల 21న త‌న ఇంట్లోనే పురుగుల మందు తాగింది. దీంతో వెంట‌నే ఆమెను ములుగు గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రికి తరలించి ట్మీట్మెంట్ అందించారు. కానీ పరిస్థితి విషమించడంతో అక్క‌డ్నుంచి హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, అనంత‌రం హైదరాబాద్‌కు తరలించారు.

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రి డాక్ట‌ర్లు ఎంత ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ ఆమెను కాపాడ‌లేక‌పోయారు. గురువారం మ‌హిళా ఎంపీటీసీ తుది శ్వాస విడిచింది. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు. స్వరాజ్యం కొన్నాళ్లుగా బిజినెస్‌ చేస్తోందని, అందులో నష్టం రావ‌డంతో..ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై ఆత్మహత్య చేసున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. ములుగు జడ్పీ ఛైర్మన్‌ జగదీశ్వర్‌, ఎమ్మెల్యే సీతక్క తదితరులు మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు.