చిరంజీవి జనసేనానికి జై కొడతారా?

Will Chiranjeevi support to Pawan Kalyan Janasena, చిరంజీవి జనసేనానికి జై కొడతారా?

పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించిన తర్వాత అన్నదమ్ములు రాజకీయ వేదిక మీద ఎప్పుడూ కలిసి కనిపించలేదు. అయితే ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరూ సినిమా కోసం కలిశారు. అన్నయ్య సైరా సినిమాకి తమ్ముడు సై అనేశాడు. మెగాస్టార్ 151 మూవీకి జనసేనాని వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అంటే పవన్ తన మాటలతో మనకి సినిమాని చూపించబోతున్నాడు. మరి అన్నదమ్ముల అనుబంధం సిల్వర్ స్ర్కీన్ కే పరిమితమా? లేక పొలిటికల్ స్ర్కీన్ మీద కూడా కనిపిస్తుందా?

మెగా కాంబినేషన్. మెగాస్టార్ చిత్రానికి పవర్ స్టార్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక చెప్పేదేముంది.. అభిమానులకు పెద్ద పండుగే. అయితే జనసేనకి బూస్ట్ ఇవ్వడం కోసం చిరంజీవి మద్దతుగా నిలబడతారా? అనే విషయంపై జన సైనికులంతా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పేరుకు కాంగ్రెస్ లోనే ఉన్నప్పటికి రాజకీయంగా సైలెంట్ అయిపోయారు చిరంజీవి. ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు తమ్ముడి కోసం చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరందుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *