Budget 2021: పన్ను చెల్లింపుదారులకు ఊరట లభిస్తుందా..? ఆదాయ పన్ను మినహాయింపులపై సర్వత్రా ఆసక్తి

Budget 2021: ఫిబ్రవరి 1న బడ్జెట్‌ 2021 ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌. అయితే కరోనా మహమ్మారి కారణంగా ప్రజల ఆదాయం తగ్గిపోయింది....

Budget 2021: పన్ను చెల్లింపుదారులకు ఊరట లభిస్తుందా..? ఆదాయ పన్ను మినహాయింపులపై సర్వత్రా ఆసక్తి
Follow us

|

Updated on: Jan 22, 2021 | 6:28 PM

Budget 2021: ఫిబ్రవరి 1న బడ్జెట్‌ 2021 ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌. అయితే కరోనా మహమ్మారి కారణంగా ప్రజల ఆదాయం తగ్గిపోయింది. ఖర్చు పెట్టే శక్తి కూడా లేకుండాపోయింది. ప్రజలచేతిలో కాస్త మిగులు ఉండేలా చూసేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలు కీలకంగా మారనున్నాయి. కొత్త బడ్జెట్‌లో సామాన్యులకు ఊరట కల్పించేలా ఏం చర్యలు తీసుకోబోతున్నారు..? ఆదాయపు పన్ను రాయితీలు పెంచుతుందా అనే విషయాలపై చర్చ కొనసాగుతున్నాయి. ఈ బడ్జెట్‌ చరిత్రలో గుర్తిండేలా ఉంటుందని తెలుస్తోంది. ఈ బడ్జెట్‌ అన్ని వర్గాల వారికి ప్రయోజనం చేకూరేలా ఉంటుందని తెలుస్తోంది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఎంతో ఉపశమనం కలిగించేలా ఉంటుందని పలువురు అధికారులు భావిస్తున్నారు. అయితే పన్ను చెల్లింపుదారులకు ఉపయోగపడే ప్రకటన చేయాల్సి చేయాలి.

కోవిడ్‌-19 తర్వాత ఆరోగ్యబీమా ప్రీమియాలు దాదాపు 10 శాతానికిపైగానే పెరిగాయి. అందరూ పెద్ద మొత్తం పాలసీలు తీసుకునేందుకు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ఆరోగ్య బీమా కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇప్పుడు 60 ఏళ్లలోపు వారికి రూ.25,000 సీనియర్ సిటిజన్లకు రూ.50 వేల వరకు ప్రీమియం మినహాయింపు లభిస్తోంది. ఈ మినహాయింపులు పెంచాలని పాలసీదారులు కోరుతున్నారు. ముందస్తు వైద్య చికిత్సల కోసం రూ.5 లక్షల వరకు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. పెరిగిన వైద్య పరీక్షల ఖర్చు నేపథ్యంలో దీనిని రూ.10వేలైనా చేయాలనే సూచనలున్నాయి. అలాగే కోవిడ్‌ చికిత్స కోసం ఖర్చు చేసిన వారికి, ఆ మొత్తాన్ని ఏదైనా ప్రత్యేక విభాగం కింద మినహాయింపు పొందే అవకాశం ఇవ్వాలనేది పన్ను చెల్లింపుదారుల కోరుతున్నారు.

ఇప్పుడు అధికంగా గృహరుణం తీసుకుని సొంతింటి వారయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రుణాల వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం వారికి కలిసివచ్చే అంశం. స్థిరాస్తి రంగానికి మరింత ప్రోత్సాహం ఇవ్వాలంటే గృహ రుణ వడ్డీపై సెక్షన్‌ 24(బీ)కింద ఇస్తున్న మినహాయింపు పరిమితి రూ.2 లక్షల నుంచి 4 లక్షల వరకు పెంచాలనేది ఉంది. గృహరుణ అసలును సెక్షన్‌ 80సీ నుంచి తప్పించి మరో విభాగంలో చేర్చాలని కోరుతున్నారు.

కోవిడ్‌తో కార్యాలయాలకు వెళ్లేవారు తగ్గిపోయారు. ఇంటి నుంచి పని చేయడం అనేది చాలా పెరిగింది. ఉద్యోగులకు ఫర్నీచర్‌, ఇతర ఖర్చులు పెరిగిపోయాయి. కార్యాలయాలకు వెళ్లినప్పుడు లభించే కొన్ని ప్రయోజనాలకు వారు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో కరోనా పేరుతో ప్రత్యేక తగ్గింపును 2021-22ఆర్థిక సంవత్సరానికి వర్తించేలా మినహాయింపు అందించాలన్నది పన్నుచెల్లింపుదారుల కోరిక.

అలాగే కరోనా చికిత్స చాలా ఖరీదైనది. కరోనా కారణంగా ఎవరైనా కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తే అప్పుడు వైద్యానికి అయ్యే ఖర్చు లక్షల్లో చేరుకుంటుంది. చాలా తక్కువ మందికి వైద్య బీమా సౌకర్యం ఉంది. బీమా కలిగిన వారు కూడా కరోనా కంటే పరిమితికి మెడికల్‌ బిల్లుల పెరుగుదల కారణంగా బీమా కంపెనీలు ప్రీమియం రేటును 50 నుంచి 100 శాతం పెంచాయి. కరోనా వచ్చిన తర్వాత బీమా పెరుగుదల ఉంది. కానీ ప్రజలపై భారం పెరిగింది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని కరోనాకు సంబంధించి, లేదా వైద్య బీమాకు సంబంధించి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో పన్ను ఉపశమానాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 2.5 లక్షల వరకు పెంచే అవకాశం ఉంది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి ఇందులో ఎటువంటి మార్పు జరగలేదు. 2020లో కొత్త పన్ను విధానం మాత్రమే ప్రవేశపెట్టింది కేంద్రం. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత రెండింటిలోనూ ఒక పన్ను వ్యవస్థను ఎంచుకోవడానికి అవకాశం ఇచ్చింది. కొత్త పన్ను విధానంలో మినహాయింపు ఇవ్వలేదు. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం ఇస్తూ ప్రభుత్వం పన్ను మినహాయింపు పరిమితిని 5 లక్షలకు రెట్టింపు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 2.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు. 2.5 నంచి 5 లక్షల ఆదాయంపై 5 శాతం పన్ను విధిస్తోంది. అయితే 2019 బడ్జెట్‌లో ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. దీని కింద 5 లక్షల ఆదాయం వరకు ఉన్న పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి పన్ను విధించలేదు.

అయితే పాలసీబజార్‌.కామ్‌ సీఈవో ఆదిల్‌ శెట్టి మాట్లాడుతూ.. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు, గృహ రుణాలపై మినహాయింపు పరిధిని విస్తరించాలన్నారు. రియాల్టి రంగానికి వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ బడ్జెట్‌ ఆదాయ పన్ను చట్టానికి కొత్త విభాగాన్ని చేర్చాలని ఆయన పేర్కొంటున్నారు.

అయితే కరోనా దెబ్బకు కొన్ని రంగాల సంస్థలు ఆదాయాలు తగ్గించేశాయి. దీని వల్ల 2021-22లో పన్ను చెల్లింపులు తగ్గే అవకాశం ఉందని అంచనాలున్నాయి. ఇలాంటప్పుడు పన్ను పరంగా మరి కొన్ని వెసులుబాట్లు కల్పించేందుకు ఆర్థిక మంత్రి ముందడుగు వేస్తారా..? అన్నది ఫిబ్రవరి 1న తేలనుంది.

Also Read:

Railway Budget 2021: ఈసారి రైల్వే బడ్జెట్‌లో కేంద్రం ప్రైవేటు రైళ్లతో పాటు కొత్త రైళ్లపై ఫోకస్‌ పెట్టనుందా..?

మరికొద్ది రోజుల్లో పార్లమెంటు ముందుకు కేంద్ర బడ్జెట్‌.. తుదిరూపు ఇచ్చే పనిలో నిర్మలా సీతారామన్‌ బిజీ

ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..