Breaking News
  • చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసు. ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళనలు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌. నేడు ఐఐటీ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు.
  • కరీంనగర్‌: అలుగునూరులో రోడ్డుప్రమాదం. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. మృతులు సాయికిరణ్‌, సాయికృష్ణగా గుర్తింపు.
  • నిజామాబాద్‌: భీమ్‌గల్‌ మండలం లింబాద్రిగుట్ట జాతరలో ప్రమాదం. డ్యాన్సింగ్‌ వీలుపై నుంచి పడి రవి అనే వ్యక్తికి తీవ్రగాయాలు. నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలింపు.
  • ప్రభుత్వం 50 మంది కార్మికులను చంపేసింది. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. వ్యక్తిగతంగా విమర్శించను.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నా. కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పట్టించుకోవాలి-పవన్‌కల్యాణ్‌.
  • విశాఖ: ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. అరకులో 13, చింతపల్లిలో 8, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
  • కర్నూలు: విజయానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌ అరెస్ట్. సాంబార్‌ గిన్నెలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనలో అరెస్ట్‌. కరస్పాండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డిని.. రహస్యంగా రిమాండ్‌కు తరలించిన పాణ్యం పోలీసులు. హాస్టల్‌కు అనుమతి లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఇంత వరకు బయటకు రాని సీసీఫుటేజ్‌. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవంటున్న యాజమాన్యం.
  • హైదరాబాద్‌: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం. అయ్యప్ప సొసైటీలో అదుపుతప్పి స్కూల్‌ బస్సు బోల్తా. బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

ఇలా అయితే వాకౌట్ చేస్తాం.. సుప్రీం చీఫ్ జస్టిస్ స్ట్రాంగ్ వార్నింగ్ !

బుధవారం అయోధ్య కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో హైడ్రామా నడిచింది. విచారణ చివరి రోజున హిందూ మహాసభ.. ఇక్కడ రామ్ లాలా (రాముని జన్మ స్థలం) ఉండేదనడానికి సాక్ష్యా ధారాలు ఉన్నాయని చూపడానికి ప్రయత్నించగా.. ముస్లిం వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ వాటిని చించి వేశారు. మొదట తాము కొత్త ఆధారాలు సమర్పిస్తామని, ఇందుకు సంబంధించిన పుస్తకాన్ని అందజేసేందుకు అనుమతించాలని హిందూ మహాసభ లాయర్ వికాస్ సింగ్.. కోర్టును కోరారు. (మాజీ ఐపీఎస్ అధికారి కిషోర్ కునాల్ ఈ పుస్తకాన్ని రచించారు). అయితే దీనికి ధావన్ అభ్యంతరం చెప్పారు. ఇది కొత్త పుస్తకం.. దీన్ని రికార్డుల్లో పెట్టాలని చూస్తున్నారు అని ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కానీ.. వికాస్ సింగ్ ఆయనతో విభేదిస్తూ.. ఈ బుక్ ని కోర్టుకు తీసుకువచ్చేందుకు న్యాయమూర్తులు అనుమతించారని, రాముడు వివాదాస్పద స్థలంలోనే జన్మించాడని చెబుతున్న ప్రదేశానికి సంబంధించిన ఆధారాలు ఇందులో ఉన్నాయని అన్నారు. దీంతో ఆగ్రహం చెందిన ధావన్ ఈ డాక్యుమెంటును చించివేస్తానన్నారు. రాముడి భార్య సీతాదేవి వంట చేసినట్టు చెబుతున్న వంటగృహం (కిచెన్) నిర్దేశిత స్థలంలో ఉన్నట్టు ఈ బుక్ లోని మ్యాప్ చూపుతోందని వికాస్ సింగ్ పేర్కొన్నారు.

రామజన్మ స్థలానికి ఆధారం కూడా ఈ మ్యాపేనని కూడా ఆయన చెప్పారు.దీంతో రాజీవ్ ధావన్ మళ్ళీ అడ్డు తగిలారు. ఇద్దరు లాయర్లూ గొంతెత్తి వాదులాడుకున్నారు. ఒక దశలో కోపం పట్టలేని రాజీవ్ ధావన్.. ఆ మ్యాప్ ను చించివేశారు. ఈ దృశ్యం చూసిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్… విచారణ ఇలాగే కొనసాగితే.. దీన్ని ముగించి లేచి వెళ్లిపోతామని ఆవేశంగా పేర్కొన్నారు. అసలు ఈ వ్యవస్థే భ్రష్టు పట్టింది.. మేం వాకౌట్ చేస్తాం అని తీవ్ర స్వరంతో అన్నారు. కాస్త శాంతించిన ఆయన.. ఈ పుస్తకాన్ని తాను చదువుతానని చెప్పారు. అసలు నవంబరు వరకూ చదువుతూనే ఉంటా అని కూడా అన్నారు. (నవంబరు 17 న ఆయన రిటైర్ కానున్నారు). కాగా- అయిదుగురు జడ్జీల ధర్మాసనం…. ఈ కేసుకు సంబంధించి పిటిషనర్ల తరఫు లాయర్లు తమ వాదనలను ఈ సాయంత్రం 5 గంటలకల్లా ముగించాలని ఉత్తర్వులిచ్చింది.