కష్టపడ్డాం..కానీ..మీలాగే మేము కూడా.. !

all disappointed says virat kohli, కష్టపడ్డాం..కానీ..మీలాగే మేము కూడా.. !

వాల్డ్ కప్ సెమి-ఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓటమి..భారత క్రికెట్ ప్రియులను తీవ్ర నిరాశలో ముంచేసింది. 50 ఓవర్లలో 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం టీమిండియా వంటి పటిష్టమైన జట్టుకు ఏమంత కష్టం కానప్పటికీ.. ప్రత్యర్థి జట్టు ధాటి బౌలింగ్ ముందు తలవంచక తప్పలేదు. (49.3) ఓవర్లలో 221 పరుగులకు కోహ్లీ సేన ఆలౌట్ అయింది). మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తమ వెన్నంటి ఉండి ప్రోత్సహించినందుకు ఫాన్స్ కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు. ‘ మేము మా శాయశక్తులా పోరాడాం.. కానీ ఫలితం మరోలా ఉంది. మీ లాగే మేమూ ఎమోషన్స్ ని పంచుకుంటున్నాం ‘ అని పేర్కొన్నాడు. మా మీద మీరు కురిపించిన ప్రేమాభిమానానికి ధన్యవాదాలని అన్నాడు. ఇక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన కోహ్లీ.. షాట్ సెలెక్షన్ అన్నది మరింత బెటర్ గా ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. మా టీమ్ విచారంగా ఉంది. కానీ మనోనిబ్బరం కోల్పోలేదు అని అన్నాడు. మ్యాచ్ గెలవకపోతే ఎవరైనా బాధ పడడం సహజమని, న్యూజిలాండ్ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారని కితాబిచ్చాడు. రిషబ్ పంత్ కు మరికొంత సమయం ఇవ్వాల్సి ఉండిందని, కుర్రాడైన పంత్..హార్దిక్ తో మంచి పార్ట్ నర్ షిప్ ఇచ్చాడని కోహ్లీ ప్రశంసించాడు. నా కెరీర్ లో నేనూ ఎన్నో పొరబాట్లు చేశాను.. కానీ ఎప్పటికప్పుడు వాటిని సరిదిద్దుకుంటూ రావడానికి ప్రయత్నించాను..పంత్ టాలెంట్ ఏంటో చూశాను అని వ్యాఖ్యానించాడు. ఇక బర్మింగ్ హామ్ లో ఇవాళ ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య సెమి ఫైనల్ రెండో మ్యాచ్ జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *