ఫ్లాష్‌న్యూస్.. వరంగల్ చిన్నారి హత్య కేసులో సుప్రీం మెట్లెక్కనున్న పోలీసులు

సంచలనం సృష్టించిన వరంగల్‌ చిన్నారి హత్యకేసులో సుప్రీంకోర్టు మెట్లెక్కనున్నరు వరంగల్ పోలీసులు. కొద్ది నెలల క్రితం హన్మకొండలోని ఓ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి హత్యచేసిన నిందితుడు ప్రవీణ్ కుమార్‌కు గతంలో వరంగల్ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే మరణశిక్ష తీర్పును సవాల్ చేస్తూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో.. వరంగల్ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును.. పరిశీలించి.. నిందితుడికి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మార్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. […]

ఫ్లాష్‌న్యూస్.. వరంగల్ చిన్నారి హత్య కేసులో సుప్రీం మెట్లెక్కనున్న పోలీసులు
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 10, 2019 | 1:38 PM

సంచలనం సృష్టించిన వరంగల్‌ చిన్నారి హత్యకేసులో సుప్రీంకోర్టు మెట్లెక్కనున్నరు వరంగల్ పోలీసులు. కొద్ది నెలల క్రితం హన్మకొండలోని ఓ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి హత్యచేసిన నిందితుడు ప్రవీణ్ కుమార్‌కు గతంలో వరంగల్ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే మరణశిక్ష తీర్పును సవాల్ చేస్తూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో.. వరంగల్ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును.. పరిశీలించి.. నిందితుడికి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మార్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి..హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తు.. సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేస్తున్నట్లుగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రకటించారు.