ఒకే ఫ్రేమ్‌లో ప్రభాస్‌, హృతిక్‌.. మాస్ డైరక్టర్ సీక్రెట్ ప్లాన్

ఇండస్ట్రీలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న మాస్ హీరోల్లో హృతిక్ రోషన్, ప్రభాస్‌లు ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. ఇద్దరి కటౌట్లు చాలు.. ప్రేక్షకులను థియేటర్ల వరకు రెప్పించడానికి.. అలాంటిది వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే.? బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయమే. ఇక ఇది త్వరలోనే నిజం కాబోతోంది. ఇటీవల హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం ‘వార్’ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతటి ఘన […]

  • Ravi Kiran
  • Publish Date - 5:03 pm, Tue, 22 October 19

ఇండస్ట్రీలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న మాస్ హీరోల్లో హృతిక్ రోషన్, ప్రభాస్‌లు ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. ఇద్దరి కటౌట్లు చాలు.. ప్రేక్షకులను థియేటర్ల వరకు రెప్పించడానికి.. అలాంటిది వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే.? బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయమే. ఇక ఇది త్వరలోనే నిజం కాబోతోంది.

ఇటీవల హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం ‘వార్’ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతటి ఘన విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. హృతిక్‌ను మళ్ళీ బీ-టౌన్‌లో సూపర్ స్టార్‌ను చేసింది. ఈ సినిమాను నిర్మించిన యష్ రాజ్ సంస్థ.. త్వరలోనే దీనికి సీక్వెల్‌ తీయాలనే ప్లాన్‌లో ఉన్నారట. హృతిక్‌కి పోటీగా టైగర్ ష్రాఫ్ ‘వార్’లో దుమ్ములేపేశాడు. ఇప్పుడు ‘వార్ 2’లో కూడా హృతిక్‌కు ధీటుగా నిలబడేవాడు ఉండాలని చిత్ర యూనిట్ చూస్తున్నారు.

ఇక దానికోసం రెబెల్ స్టార్ ప్రభాస్‌తో సంప్రదింపులు జరపాలని ప్రయత్నిస్తున్నారట. ప్రభాస్‌కు వరల్డ్ వైడ్ మార్కెట్ ఉంది.. అంతేకాకుండా బాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ ఉండటంతో.. అతనైతేనే సినిమాకు సరిగ్గా సూట్ అవుతాడని యష్ రాజ్ సంస్థ భావిస్తోందని సమాచారం. ప్రభాస్ బీ-టౌన్లో సెటిల్ కావడానికి కూడా ఇది కరెక్ట్ ప్రాజెక్ట్ అని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. మరి యష్ రాజ్ సంస్థ ప్రభాస్‌ను ఒప్పిస్తారో లేదో వేచి చూడాలి.

గతంలో కరణ్ జోహార్‌తో ప్రభాస్‌కు పారితోషికం దగ్గరే పేచీ వచ్చి ప్రాజెక్ట్ క్యాన్సెల్ అయిందని వినికిడి. అయితే యష్ రాజ్ సంస్థకు పారితోషికం విషయంలో ఇబ్బంది ఉండదు.. ఈ సంస్థ హీరోలకు చిత్ర లాభాల్లో వాటాలు ఇవ్వడం అలవాటు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోందని ఫ్యాన్స్  అంటున్నారు.