విశాఖ‌ : పెళ్లికి అతిథులు రాలేదు..కానీ మూడు పూటలా విందు భోజ‌నాలు

కరోనా ప్రభావంతో ఏదో ఓ సంద‌ర్భంలో ఎఫెక్ట్ అవ్వ‌ని ప‌ర్స‌న్ అంటూ ఉండ‌రేమో. ఇక ఇప్పుడు పెళ్లిళ్ల‌పై కూడా క‌రోనా ప్ర‌భావం అధికంగానే ఉంది.

విశాఖ‌ : పెళ్లికి అతిథులు రాలేదు..కానీ మూడు పూటలా విందు భోజ‌నాలు
Follow us

|

Updated on: Jul 25, 2020 | 4:19 PM

కరోనా ప్రభావంతో ఏదో ఓ సంద‌ర్భంలో ఎఫెక్ట్ అవ్వ‌ని ప‌ర్స‌న్ అంటూ ఉండ‌రేమో. ఇక ఇప్పుడు పెళ్లిళ్ల‌పై కూడా క‌రోనా ప్ర‌భావం అధికంగానే ఉంది. జీవితంలో ఎంతో ముఖ్య‌మైన వివాహ వేడుక‌ను గుర్తిండిపోయేలా చేసుకోవాల‌ని అనుకున్న చాలామంది ఆశ‌ల‌పై క‌రోనా నీళ్లు చ‌ల్లింది. చ‌డీ చప్పుడు కాకుండా కుదిరితే రిజిస్ట‌ర్ ఆఫీసులో లేదంటే ఓ 20 మందిలోపు బంధుమిత్రుల‌తో తంతు ముగించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక పెళ్లి చేసుకోవాలంటే అధికారులు, పోలీసుల నుంచి అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి అయింది. ప్రి వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్, హంగులు, ఆర్బాటాలు విందులు, వినోదాలు ఏం లేవు. ఈ క్ర‌మంలో పెళ్లికి అతిథుల్ని, అయిన‌వాళ్ల‌ని పిల‌వ‌లేక‌పోయామ‌ని భావిస్తున్నవారు కాస్త డిఫ‌రెంట్ గా థింక్ చేస్తున్నారు. పెళ్లి సంద‌ర్భంగా బంధుమిత్రులందరికీ మంచి విందు భోజనం అందించేలా విశాఖకు చెందిన ఓ యువకుడికి మంచి ఐడియా తట్టింది.

విశాఖకు చెందిన వ్య‌క్తి ఐదు నెలల కిందట పెళ్లి నిశ్చయమైంది. ఎంగేజ్మెంట్ కూడా ముగిసింది. జూలై 25న పెళ్లి గ్రాండ్ గా చేసేందుకు ఇరు కుటుంబాల పెద్ద‌లు డిసైడ‌య్యారు. ఇంత‌లో క‌రోనా ఎంట్రీ ఇచ్చింది. వారి ఆశ‌ల‌న్నీ అడియాశ‌ల‌య్యాయి. దీంతో పెళ్లి సింపుల్ గా చేసుకున్న‌ప్ప‌టికీ, విందు భోజనం సంప్రదాయాన్ని కొనసాగించాలని పెళ్లి కుమారుడు డిసైడ‌య్యాడు. బంధువులు, అతిథులకు ఎలాగైనా క‌డుపునిండా క‌మ్మ‌టి భోజనం పెట్టాలనుకున్నాడు. వారంద‌ర్నీ పిల‌వ‌లేరు కాబ‌ట్టి, భోజ‌నాలు త‌యారు చేయించి బంధువులు ఇంటికి పంపాల‌ని ఫిక్స్ అయ్యాడు. అనుకున్న‌ట్లుగానే వాళ్ల ఇళ్ల‌కే నేరుగా టిఫిన్, లంచ్, డిన్న‌ర్ పంపించేలా ఏర్పాట్లు చేశాడు. శుక్రవారం యువకుడ్ని పెండ్లి కుమారుడ్ని చేయగా.. ఉదయం 7 గంటలకే బంధువుల ఇంటికి నేరుగా అల్పాహారం పంపించాడు. 11 గంటలకే భోజనం కూడా వేడివేడిగా అందేలా చేశాడు. ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో డీటేల్స్ తెలుసుకుని టిఫిన్, భోజనాలు, ప్లేట్లు, స్పూన్, వాటర్‌ బాటిల్ ఇలా అన్నీ పంపాడు. పెళ్లికి వెళ్లలేకపోయినా ఎవరి ఇళ్లలో వారే విందు భోజనం లాగించేసి..క‌డుపునిండా నూత‌న వ‌ధూవ‌రుల‌ను ధీవించారు బంధుమిత్రులు.

ఇది కూడా చ‌ద‌వండి: ‘తాళికట్టు శుభవేళ’ వరుడికి కరోనా..పెళ్లింట కలకలం

Latest Articles
ముద్దు సీన్స్ పై మృణాల్.. కన్యాకుమారిలో మాళవిక.. వయా సామ్ బంగారం.
ముద్దు సీన్స్ పై మృణాల్.. కన్యాకుమారిలో మాళవిక.. వయా సామ్ బంగారం.
టీ20ప్రపంచకప్‌లో తొలిసారి ఆడనున్న ముగ్గురు.. లిస్టులో హైదరాబాదోడు
టీ20ప్రపంచకప్‌లో తొలిసారి ఆడనున్న ముగ్గురు.. లిస్టులో హైదరాబాదోడు
టీడీఎస్ మినహాయింపు కోరుకునే వారికి గుడ్ న్యూస్..ఆ గడువు పెంపు
టీడీఎస్ మినహాయింపు కోరుకునే వారికి గుడ్ న్యూస్..ఆ గడువు పెంపు
మీన రాశిలో కుజుడు సంచారం.. ఈ రాశల వారికి ధన యోగాలు పక్కా.. !
మీన రాశిలో కుజుడు సంచారం.. ఈ రాశల వారికి ధన యోగాలు పక్కా.. !
ఇంజెక్షన్‌ చేసిన పుచ్చకాయను ఎలా గుర్తించాలో తెలుసా.?
ఇంజెక్షన్‌ చేసిన పుచ్చకాయను ఎలా గుర్తించాలో తెలుసా.?
తమన్నా, రాశీఖన్నా బాక్‌ రెడీ.! | మరింత గ్రాండ్‌గా చిరు విశ్వంభర..
తమన్నా, రాశీఖన్నా బాక్‌ రెడీ.! | మరింత గ్రాండ్‌గా చిరు విశ్వంభర..
సమ్మర్‌లో కూడా కూల్‌గా ఉండాలనుకుంటున్నారా.. వీటిని మిస్ చేయకండి!
సమ్మర్‌లో కూడా కూల్‌గా ఉండాలనుకుంటున్నారా.. వీటిని మిస్ చేయకండి!
విజయవాడలో ఘోరం.. గొంతు కోసుకుని డాక్టర్‌ ఫ్యామిలీ మొత్తం సూసైడ్!
విజయవాడలో ఘోరం.. గొంతు కోసుకుని డాక్టర్‌ ఫ్యామిలీ మొత్తం సూసైడ్!
ముంబైలో తారక్ పార్టీ షురూ.! సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ గురూ.!
ముంబైలో తారక్ పార్టీ షురూ.! సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ గురూ.!
ఈ ఏసీ మీరెక్కడి వెళితే అక్కడికి వస్తుంది.. ఏం టెక్నాలజీ గురూ
ఈ ఏసీ మీరెక్కడి వెళితే అక్కడికి వస్తుంది.. ఏం టెక్నాలజీ గురూ