Watermelon: ఇంజెక్షన్‌ చేసిన పుచ్చకాయను ఎలా గుర్తించాలో తెలుసా.?

అయితే అంతా బాగానే ఉన్నా.. కొందరు వ్యాపారులు మాత్రం ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తూ పుచ్చకాయలు త్వరగా పండడానికి అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు. వాటర్‌ మిలాన్‌ ఎర్రగా కనిపించేందుకు రకరకాల ఇంజెక్షన్లను ఇస్తున్నారు. ఇలాంటి పండ్లను తీసుకుంటే అనారోగ్యాల బారిన పడడం ఖాయం. అయితే మరి ఇంజెక్షన్లను ఇచ్చిన పుచ్చకాయలను...

Watermelon: ఇంజెక్షన్‌ చేసిన పుచ్చకాయను ఎలా గుర్తించాలో తెలుసా.?
Water Melon
Follow us

|

Updated on: Apr 30, 2024 | 3:18 PM

సమ్మర్‌లో విరివిగా లభించే పండ్లలో వాటర్ మిలాన్‌ ఒకటి. పుచ్చకాయలో దాదాపు 90 శాతం నీటి కంటెంట్‌ ఉంటుంది. అందుకే వేసవిలో పుచ్చకాయను తీసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తుంటారు. ముఖ్యంగా సమ్మర్‌లో పుచ్చకాయను తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌ సమస్య దరిచేరకుండా ఉంటుంది.

అయితే అంతా బాగానే ఉన్నా.. కొందరు వ్యాపారులు మాత్రం ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తూ పుచ్చకాయలు త్వరగా పండడానికి అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు. వాటర్‌ మిలాన్‌ ఎర్రగా కనిపించేందుకు రకరకాల ఇంజెక్షన్లను ఇస్తున్నారు. ఇలాంటి పండ్లను తీసుకుంటే అనారోగ్యాల బారిన పడడం ఖాయం. అయితే మరి ఇంజెక్షన్లను ఇచ్చిన పుచ్చకాయలను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకవేళ పుచ్చకాయలో పసుపు మచ్చలతో కొద్దిగా తెల్లగా ఉంటే దాన్ని కచ్చితంగా ఇంజెక్షన్‌ చేసి ఉంటారని భావించాలి. అంతేకాకుండా పుచ్చకాయ త్వరగా పండడానికి కొందరు కార్బైడ్‌ అనే కెమికల్‌ను చల్లుతారు. అందుకే పుచ్చకాయపై పసుపు రంగులో ఉంటే ఉప్పు నీటితో కడిగి తీసుకోవాలి. సాధారణం కంటే ఎక్కువ ఏరుపు రంగు ఉన్నా ఆ పండుకు ఇంజక్షన్‌ చేసి ఉండొచ్చని భావించాలి.

ఇక వాటర్‌ మిలాన్‌పైస ఏవైనా రంధ్రాలు ఉన్నాయేమో గమనించాలి. ఇలా ఉంటే ఆ పండుకు ఇంజక్షన్‌ చేసి ఉండొచ్చని గుర్తించాలి. అలాగే ఇంజక్షన్‌ చేసిన వాటర్‌మెలన్‌ను కోసినప్పుడు ఆ కాయలో పగుళ్లు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చూశారుగా ఇకపై పుచ్చకాయ కొనేప్పుడు ఇవన్నీ గమనించే తీసుకోండి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..