ఇంట్లోనే ఉండండి.. రోడ్డెక్కారో.. కరోనా పోలీస్ చేతిలో బుక్ అవుతారు..!

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ప్రజల్ని ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత చెప్పినా.. పోలీసులు లాఠీ చార్జ్ చేసినా.. పలుచోట్ల ప్రజల్లో మార్పు రావడం లేదు.ఈ నేపథ్యంలో చెన్నై పోలీసులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. కరోనా మహమ్మారి ఆకారంలో తయారు చేసిన ఓ హెల్మెట్‌ను ధరించి.. రోడ్లపైకి వచ్చిన వారికి […]

ఇంట్లోనే ఉండండి.. రోడ్డెక్కారో.. కరోనా పోలీస్ చేతిలో బుక్ అవుతారు..!
Follow us

| Edited By:

Updated on: Mar 28, 2020 | 8:34 PM

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ప్రజల్ని ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత చెప్పినా.. పోలీసులు లాఠీ చార్జ్ చేసినా.. పలుచోట్ల ప్రజల్లో మార్పు రావడం లేదు.ఈ నేపథ్యంలో చెన్నై పోలీసులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. కరోనా మహమ్మారి ఆకారంలో తయారు చేసిన ఓ హెల్మెట్‌ను ధరించి.. రోడ్లపైకి వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. తాము ఎంత చెప్పినా కొందరు మాత్రం వినకుండా రోడ్లపైకి వస్తున్నారని.. వారికి కరోనా ప్రభావం తెలియడం లేదని.. అందుకే ఇలా కరోనా వైరస్ ఆకారంలో హెల్మెట్ తయారు చేయించి ప్రచారం చేపడుతున్నామని పోలీసులు అన్నారు. ఇలా అయినా కనీసం ప్రజల్లో కరోనా వైరస్‌పై భయం పెంచి, వారిని ఇళ్లకే పరిమితం చేయాలని ప్రయత్నిస్తున్నామన్నారు.