శ్రీ మహాలక్ష్మీగా దర్శనమిస్తున్న బెజవాడ దుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రంగం రంగం వైభవంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్న బెజవాడ దుర్గమ్మ... ఇవాళ శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులకు కరుణిస్తున్నారు. మంగళప్రదమైన దేవత...

శ్రీ మహాలక్ష్మీగా దర్శనమిస్తున్న బెజవాడ దుర్గమ్మ
Follow us

|

Updated on: Oct 23, 2020 | 12:40 PM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రంగం రంగం వైభవంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్న బెజవాడ దుర్గమ్మ… ఇవాళ శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులకు కరుణిస్తున్నారు. మంగళప్రదమైన దేవత మహాలక్ష్మీదేవి. జగన్మాత మహాలక్ష్మీ స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్ని చేయడం ఒక అద్బుత ఘట్టం మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీమహాలక్ష్మీ అమితరమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించింది.

లోకస్ధితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీగా వరాలను ప్రసాదించే అష్టలక్ష్మీ సమిష్టిరూపమైన అమృత స్వరూపాణిగా శ్రీ దుర్గమ్మను మహాలక్ష్మిగా దర్శించవచ్చు. మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల భక్తులందరికీ ఐశ్వర్యప్రాప్తి, విజయం లభిస్తుంది.

7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది.

అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో పోలీసులు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. సామాజిక దూరంను పాటించేలా ఆలయంలో ఏర్పాట్లు చేశారు. ఇటు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అమ్మవారిని ఈ ఉదయం దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.