విజయవాడ, విశాఖలో గంజాయి మాఫియా గుట్టురట్టు

డబ్బుకోసం కొంతమంది.. మత్తు కోసం మరికొంతమంది గంజాయి ఊబిలో చిక్కుకుంటున్నారు. మత్తుకు బానిసై ఎందరో విద్యార్థులు తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఈజీగా డబ్బు సంపాదించేందుకు కొందరు గంజాయి దందా చేస్తున్నారు. విజయవాడలోని పలు కాలేజీల విద్యార్థులే లక్ష్యంగా గంజాయి దందా కొనసాగుతోంది. తాజాగా 10మంది విద్యార్థులు టాస్క్​ఫోర్స్ పోలీసులకు పట్టుబడటంతో గంజా దందా వెలుగులోకి వచ్చింది. గన్నవరం సమీపంలో కొంతమంది విద్యార్థులు గంజాయిని రవాణా చేస్తున్నారనే సమాచారంతో టాస్క్​ఫోర్స్ పోలీసులు మాటు వేసి… విద్యార్థులను అదుపులోకి […]

విజయవాడ, విశాఖలో గంజాయి మాఫియా గుట్టురట్టు
Follow us

|

Updated on: Jun 10, 2019 | 11:18 AM

డబ్బుకోసం కొంతమంది.. మత్తు కోసం మరికొంతమంది గంజాయి ఊబిలో చిక్కుకుంటున్నారు. మత్తుకు బానిసై ఎందరో విద్యార్థులు తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఈజీగా డబ్బు సంపాదించేందుకు కొందరు గంజాయి దందా చేస్తున్నారు. విజయవాడలోని పలు కాలేజీల విద్యార్థులే లక్ష్యంగా గంజాయి దందా కొనసాగుతోంది. తాజాగా 10మంది విద్యార్థులు టాస్క్​ఫోర్స్ పోలీసులకు పట్టుబడటంతో గంజా దందా వెలుగులోకి వచ్చింది.

గన్నవరం సమీపంలో కొంతమంది విద్యార్థులు గంజాయిని రవాణా చేస్తున్నారనే సమాచారంతో టాస్క్​ఫోర్స్ పోలీసులు మాటు వేసి… విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో గంజాయి మాఫియా గుట్టు బయటపడింది. పట్టుబడిన 10 మంది విద్యార్థుల్లో ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం వీరు అరకులో గంజాయి కొనుగోలు చేసి నగరానికి తీసుకొస్తున్నారు. ఆ తర్వాత గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి స్థానికంగా ఉన్న విద్యార్థులకు విక్రయిస్తున్నారు. వీరికి ఎవరెవరితో సంబంధాలున్నాయనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

విశాఖ ఏజెన్సీలో వేల ఎకరాల్లో గంజాయి సాగుచేసి… మహరాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు విజయవాడ మీదుగా తరలిస్తున్నారు. తాజాగా కొద్ది రోజుల క్రితం రూ.2 కోట్లు విలువ చేసే గంజాయిని ఇసుక ట్రాక్టర్లలో తరలిస్తుండగా డైరక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. పోలీసులు నిఘా పెడుతున్నా గంజాయి రవాణా మాత్రం ఆగడం లేదు. చెడు వ్యసనాలకు బానిసలైన యువకులు డబ్బుకోసం అడ్డదారులు తొక్కుతున్నారు. కళాశాలలపై నిఘా మరింత పెంచాలని నగరవాసులు కోరుతున్నారు.