విజయారెడ్డికి పట్టిన గతే నీకూ పడుతుంది: ఆర్డీవోకు బెదిరింపులు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనంతో తెలుగు రాష్ట్రాల్లోని రెవెన్యూ అధికారుల్లో భయం పట్టుకుంది. ఈ ఘటన తరువాత రెవెన్యూ అధికారులు తమ కార్యాలయాల్లో భద్రతా ఏర్పాట్లను పెంచుకుంటున్నారు. కాగా మరికొన్ని ప్రాంతాల్లో ఈ సంఘటనను చూపిస్తూ రెవెన్యూ అధికారులను బెదిరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ రైతు ఏకంగా రెవెన్యూ అధికారులపై పెట్రోల్ జల్లగా.. ములుగు జిల్లాలో ఓ మహిళ బడితె కర్ర పట్టుకుని ఎమ్మార్వో కార్యాలయం ముందు వీరంగం వేసింది. మరో చోట తాము […]

విజయారెడ్డికి పట్టిన గతే నీకూ పడుతుంది: ఆర్డీవోకు బెదిరింపులు
Follow us

| Edited By:

Updated on: Nov 08, 2019 | 12:59 PM

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనంతో తెలుగు రాష్ట్రాల్లోని రెవెన్యూ అధికారుల్లో భయం పట్టుకుంది. ఈ ఘటన తరువాత రెవెన్యూ అధికారులు తమ కార్యాలయాల్లో భద్రతా ఏర్పాట్లను పెంచుకుంటున్నారు. కాగా మరికొన్ని ప్రాంతాల్లో ఈ సంఘటనను చూపిస్తూ రెవెన్యూ అధికారులను బెదిరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ రైతు ఏకంగా రెవెన్యూ అధికారులపై పెట్రోల్ జల్లగా.. ములుగు జిల్లాలో ఓ మహిళ బడితె కర్ర పట్టుకుని ఎమ్మార్వో కార్యాలయం ముందు వీరంగం వేసింది. మరో చోట తాము ఇచ్చిన లంచం తిరిగి ఇవ్వాలని ధర్నాలో పాల్గొన్న రెవెన్యూ ఉద్యోగులను ఓ వృద్ధజంట నిలదీసింది. తాజాగా కామారెడ్డి ఆర్డీవో రాజేంద్రకుమార్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. భూమి పాసు పుస్తకాలు జారీ చేయకపోతే విజయారెడ్డికి పట్టిన గతే మీకూ పడుతుందంటూ ఓ వ్యక్తి బెదిరించాడు.

దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా.. ఫోన్ చేసిన వ్యక్తి పోలీస్‌ శాఖలోని ఇంటెలిజెన్స్‌ విభాగంలో పనిచేసే ఏఆర్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌రెడ్డిగా తేలింది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సోమారం శివారు ప్రాంతంలో ఆ కానిస్టేబుల్‌కు చెందిన 9.12 ఎకరాల భూమి ఉంది. అయితే ఆ భూమి వివాదంలో ఉండగా.. దానికి సంబంధించిన పాసు పుస్తకాలు తమ పేరిట మంజూరు చేయాలని ఈ నెల 5న శ్రీనివాస్‌రెడ్డి రాజేంద్రకుమార్‌కు ఫోన్‌ చేశాడు. లేకపోతే విజయారెడ్డికి పట్టిన గతే తనకు పడుతుందంటూ అతడు బెదిరించినట్లు రాజేంద్రకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదు చేశారు. శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉండగా.. అతడిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ భావిస్తున్నట్లు సమాచారం.

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..