యువకుడికి అరగుండు, చెప్పుల దండతో ఊరేగింపు.. కారణం ఇదే
అనంతపురం జిల్లాలో వివాహితను వేధించాడనే ఆరోపణలతో ఓ యువకుడిని గ్రామస్థులు దేహశుద్ధి చేసి, అరగుండు గీయించి చెప్పుల దండతో ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గత ప్రేమ వ్యవహారమే ఈ వివాదానికి కారణమని తెలుస్తోంది.
ప్రేమ పేరుతో వివాహితను వేధించిన యువకుడికి దేహశుద్ధి చేయడమే కాకుండా అరగుండు గీయించి, మెడలో చెప్పుల దండి వేసి గ్రామమంతా ఊరేగించిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. డప్పు వాయిద్యాల మధ్య జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పోలీసుల సమాచారం ప్రకారం.. అనంతపురం జిల్లాలోని విడపనకల్లు మండలం గడేకల్లు గ్రామానికి చెందిన భాస్కర్ అనే యువకుడు, సదరు వివాహిత గతంలో ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు వేరొకరితో వివాహం జరిగినప్పటికీ.. భాస్కర్ ఆమెను వదలకుండా ప్రేమిస్తున్నానంటూ వెంటపడసాగాడు. ఈ వేధింపుల కారణంగా మనస్పర్థలు రావడంతో ఆమె భర్త పుట్టింట్లో వదిలివెళ్లాడు. తమ కూతురి కాపురం కూలిపోవడానికి భాస్కర్ వేధింపులే కారణమని ఆగ్రహించిన సదరు వివాహిత తల్లిదండ్రులు, బంధువులు అతనికి గట్టి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. గతంలో అనేకమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో, భాస్కర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం అరగుండు కొట్టించి, చెప్పుల దండ మెడలో వేసి గ్రామ వీధుల్లో ఊరేగిస్తూ నడిపించారు. అయితే ఈ అమానుష ఘటనపై ఫిర్యాదు చేసేందుకు యువకుడి కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాకపోవడం విశేషం. అయినప్పటికీ, దీనికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా స్పందించి విచారణ చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ టూ వీలర్ పోయిందా.. ఇక్కడుందేమో చూసుకోండి
టాయిలెట్ లేదని.. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశాడు
మృత్యుంజయుడు.. పిడుగు పడినా బతికాడు
