భారతీయులకు అమెరికా మరో షాక్.. గ్రీన్ కార్డ్ కోటా ఖతం!

Updated on: Sep 04, 2026 | 9:03 PM

అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు మరో షాక్‌ తగిలింది. అత్యంత ప్రతిభావంతుల కోసం ఉద్దేశించిన EB-1 గ్రీన్‌ కార్డ్‌ కోటా కొన్ని వారాల్లోనే పూర్తయ్యే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్‌ 30తో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో డిమాండ్‌ పెరగడమే కారణమని తెలిపింది. ఇప్పటికే EB-2 కేటగిరీ అందుబాటులో లేకపోగా, EB-3 కోసం భారతీయులు 12 ఏళ్లకు పైగా వేచి చూస్తున్నారు.

వీసాల జారీ విషయంలో ఎప్పుడూ కఠినంగా వ్యవహరించే అమెరికా తాజాగా భారతీయులకు మరో పెద్ద షాక్ ఇచ్చింది. అగ్రరాజ్యంలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న వారికి యూఎస్ విదేశాంగ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. అత్యంత ప్రతిభావంతుల కోసం ఉద్దేశించిన ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియ కొన్ని వారాల్లోనే నిలిచిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. భారతీయుల నుంచి ఈ వీసాలకు డిమాండ్ విపరీతంగా పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. సెప్టెంబర్ 30తో అమెరికా ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో, ముందే ఈ కోటా పూర్తిగా అయిపోవచ్చని తాజా వీసా బులెటిన్‌లో వెల్లడించింది. అసాధారణ నైపుణ్యాలు కలిగిన వ్యక్తులు, ప్రముఖ ప్రొఫెసర్లు, పరిశోధకులు, బహుళజాతి సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు మరియు మేనేజర్లు మొదటి ప్రాధాన్యతా వర్గమైన EB-1 కింద గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. ఇప్పటికే ఈ కేటగిరీపై పరిమితులు రావడం భారతీయులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గతంలోనే ఉన్నత విద్యార్హతలు కలిగిన నిపుణుల కోసం ఉద్దేశించిన EB-2 కేటగిరీ వీసాలను ఆగస్టు నుంచే ‘అన్‌అవైలబుల్’గా ప్రకటించారు. ఇక EB-3 కేటగిరీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇందులో గ్రీన్ కార్డు పొందాలంటే దరఖాస్తుదారులు ఏకంగా 12 ఏళ్లకు పైగా నిరీక్షించాల్సి వస్తోంది. అమెరికా ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం ప్రతి దేశానికీ కేవలం 7 శాతం కోటా మాత్రమే కేటాయించడం, మరోవైపు భారతీయుల నుంచి లక్షల సంఖ్యలో దరఖాస్తులు రావడం ఈ తీవ్ర జాప్యానికి అసలు కారణం. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తామని, అవసరమైన సర్దుబాట్లు చేస్తామని విదేశాంగ శాఖ తెలిపింది. ఒకవైపు అమెరికాలో జన్మహక్కు పౌరసత్వ నిబంధనలపై న్యాయపోరాటం నడుస్తుండగా, మరోవైపు గ్రీన్ కార్డుల కోటా నిండుకోవడం అక్కడి ప్రవాస భారతీయులకు నిద్రలేకుండా చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైకల్యాన్ని జయించి మద్రాస్‌ ఐఐటీలో సీటు సాధించి..

ఆర్బీఐ స్కీమ్‌కు అనూహ్య స్పందన.. ఎన్నారైల నుంచి పోటెత్తిన డాలర్లు

దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి మెత్తగా తాకిన దానిని చూసి హడల్‌!

Mirzapur: డిజిటల్లో బిగ్ హిట్ అయిన మీర్జాపూర్ ఇప్పుడు థియేటర్లలోకి

Sardar 2: విలన్‌గా విశ్వరూపం చూపిస్తున్న ఎస్.జె. సూర్య

Loading...
Unable to load recommendations.
Follow Us