US And China Race For Moon: చంద్రుడి కోసం చైనా – అమెరికా పోరు..! ఈ దశాబ్దంలో చందమామపై తేలిపోదాం..

Updated on: Nov 30, 2022 | 5:14 PM

భూమికి ఉన్న ఏకైక స‌హ‌జ‌సిద్ధ ఉప‌గ్ర‌హం చంద్రుడు. మామ కాని మామ చంద‌మామ‌.. చంద‌మామ రావె.. జాబిల్లా రావె.. అంటూ త‌ల్లులు త‌మ చిన్నారుల‌కు గోరు ముద్ద‌లు తినిపిస్తుంటారు. అయితే ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాల్లో ప్ర‌జ‌ల‌కు చంద్రుని ప‌ట్ల అనేక అపోహ‌లు ఉన్నాయి.

చంద్రుని మీద గ్ర‌హాంత‌ర జీవులు నివాసం ఉంటార‌ని.. అందుక‌నే మ‌నం అక్క‌డికి వెళ్ల‌లేక‌పోతున్నామ‌ని న‌మ్మేవారు కూడా ఉన్నారు. 1820ల‌లో బ‌వేరియ‌న్ అస్ట్రాన‌మ‌ర్ ఫ్రాంజ్ వాన్ పౌలా గ్రుయితుయిసెన్ చంద్రుని మీద గ్ర‌హాంతర జీవులు నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయ‌ని, దాన్ని తాను టెలిస్కోప్‌లో చూశాన‌ని చెప్పాడు. మ‌న దేశంతోపాటు అమెరికాలోని కొన్ని ప్రాంతాల వారు, బౌద్ధులు.. చంద్రుని మీద ఒక దైవ‌త్వం ఉన్న కుందేలు నివాసం ఉంటుంద‌ని న‌మ్ముతారు. అయితే ఇవ‌న్నీ కేవ‌లం అపోహ‌లు మాత్ర‌మే. నిజానికి ఇవన్నీ నిరూపితం కాలేదు.ప్రపంచాన్ని శాసిస్తున్న అగ్రదేశం అమెరికాతో ఇప్పుడు చైనా పోటీ పడుతోంది. ఈ రెండు దేశాల మధ్య ఆధిపత్య పోరు ప్రస్తుతం భూ గ్రహం ఆవలకు విస్తరించింది. పరిశోధనల పేరిట ఏకంగా చంద్ర మండలాన్ని సొంతం చేసుకోవాలని అమెరికా, చైనా తహతహలాడుతున్నాయి. తామే ముందు సొంతం చేసుకోవాలని ఆర్టిమిస్‌-1 పేరిట ఇప్పటికే ప్రాజెక్టును ప్రకటించింది అమెరికా. చంద్రుడిపై నివాసాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఆర్టిమిస్‌ను చేపట్టినట్టు అగ్రరాజ్యం ప్రకటించింది. దీనికి పోటీగా చైనా రంగంలోకి దిగింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.

Man with street dogs: వీధి కుక్కలే నేస్తాలుగా పుట్‌పాత్‌పై నిద్రపోతున్న వ్యక్తి..! 24 క్యారెట్స్‌ గోల్డ్‌ అంటున్న నెటిజనం..

Massage for Minister: తీహార్‌ జైలు కొత్త ట్విస్ట్‌.. మంత్రి సత్యేంద్రకు మసాజ్‌ చేసింది అతడే వ్యక్తి..! వీడియో

Published on: Nov 30, 2022 05:14 PM
Follow Us