ఉక్రెయిన్‌లోని అత్యంత సుందర భవనాల్లో ఒకదానిపై దాడి

Updated on: May 02, 2024 | 10:04 PM

ఉక్రెయిన్‌లోని అత్యంత సుందర భవనాల్లో ఒక దానిని రష్యా తన క్షిపణి దాడిలో ధ్వంసం చేసింది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్‌ కోటగా పేరు పొందిన ఓ ఎంపీ భవనంపై క్షిపణితో దాడి చేసింది. ఇందుకోసం ఇసికందర్‌ క్షిపణిపై క్లస్టర్‌ వార్‌హెడ్‌ను అమర్చి మాస్కో ప్రయోగించినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా.. మరో 30 మంది గాయపడినట్లు ఉక్రెయిన్‌ అధికారులు ప్రకటించారు.

ఉక్రెయిన్‌లోని అత్యంత సుందర భవనాల్లో ఒక దానిని రష్యా తన క్షిపణి దాడిలో ధ్వంసం చేసింది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్‌ కోటగా పేరు పొందిన ఓ ఎంపీ భవనంపై క్షిపణితో దాడి చేసింది. ఇందుకోసం ఇసికందర్‌ క్షిపణిపై క్లస్టర్‌ వార్‌హెడ్‌ను అమర్చి మాస్కో ప్రయోగించినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా.. మరో 30 మంది గాయపడినట్లు ఉక్రెయిన్‌ అధికారులు ప్రకటించారు. ఈ క్షిపణి పడిన చోటు నుంచి 1.5 కిలోమీటర్ల వరకు శకలాలు పడినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 20 భవనాల వరకు దెబ్బతిన్నాయి. దాడికి సంబంధించిన చిత్రాలను ఉక్రెయిన్‌ ప్రాసిక్యూటర్‌ జనరల్‌ విడుదల చేశారు. దీనిలో ఓ సుందర భవనం అగ్నికీలల్లో దహనమవుతున్న దృశ్యాలున్నాయి. మరోవైపు క్రిమియాలోని తమ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ కొన్ని క్షిపణులు, డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేసిందని రష్యా తెలిపింది. ఈ దాడిలో అమెరికా సరఫరా చేసిన ఆర్మీ టాక్టికల్‌ మిసైల్‌ సిస్టమ్‌కు చెందిన ఆయుధాలున్నట్లు చెప్పింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆహా.. ఇది కదా సంస్కారమంటే.. కట్టిపడేస్తున్న చిన్నారి వీడియో

ప్రేయసితో కలిసి లాడ్జ్‌లో స్టే చేసిన యువకుడు.. బాత్‌రూమ్‌లో ??

గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

Loading...
Unable to load recommendations.
Follow Us