ట్రంప్-జిన్‌పింగ్ భేటీ.. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో అరుదైన స్వాగతం పలికారు. రెడ్ కార్పెట్, సైనిక గౌరవాలతో జరిగిన ఈ స్వాగతం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అనంతరం ఇరువురు నేతల చర్చల్లో టారిఫ్‌లు, ట్రేడ్ డీల్, రేర్ ఎర్త్ మినరల్స్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తైవాన్, ఇరాన్ వంటి అంశాలు కీలకంగా మారాయి. వాణిజ్య సంధిని మరో రెండు నెలలు పొడిగించినట్లు అమెరికా అధికారులు తెలిపారు.
అమెరికా పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు చేరుకున్న జిన్‌పింగ్‌కి.. రెడ్ కార్పెట్, సైనిక గౌరవంతో ట్రంప్ స్వాగతం పలికారు. ఒకవైపు టారిఫ్ వార్… మరోవైపు ట్రేడ్ డీల్ టాక్… అటు తైవాన్ నుంచి టెక్నాలజీ వరకు… ఇద్దరు బిగ్ లీడర్ల మధ్య ఏం జరగబోతోంది అంటూ ప్రపంచదేశాలన్నీ ఆసక్తిగా చూస్తున్నాయి. గత కొంతకాలంగా ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్న అనేక కీలక అంశాలు ఈ భేటీలో చర్చకు రానున్నాయి. ముఖ్యంగా టారిఫ్ వార్, ట్రేడ్ డీల్, చైనీస్ ఎగుమతులు, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్, రేర్ ఎర్త్ మినరల్స్ వంటి ఆర్థిక, వాణిజ్య పరమైన సమస్యలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు తైవాన్ వ్యవహారం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , అంతర్జాతీయ భద్రత వంటి కీలక అంశాలు కూడా చర్చకు రానున్నాయి. ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య జరిగే ఒప్పందాలు లేదా నిర్ణయాలు కేవలం రెండు దేశాలకే పరిమితం కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ఈ భేటీ ఎలాంటి తిరుగులేని మార్పులకు దారితీస్తుందోనని అంతర్జాతీయ నిపుణులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
బ్యాంకుకు వచ్చేవాళ్లంతా కస్ట్‌మర్లే కాకపోవచ్చు.. తస్మాత్ జాగ్రత్త
