ముందు చక్రం ఊడి కుప్పకూలిన విమానం

Updated on: Jun 06, 2026 | 6:47 PM

జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో లుఫ్తాన్సా బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానం పార్కింగ్ బేలో ఉండగా నోస్ ల్యాండింగ్ గేర్ కుప్పకూలింది. ప్రయాణికులు ఎక్కకముందే జరిగిన ఈ ఘటనలో క్యాబిన్ సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్‌లో పలువురు గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై లుఫ్తాన్సా, బోయింగ్, జర్మన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. విమాన భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.

జర్మనీలో అత్యంత రద్దీగా ఉండే ఫ్రాంక్‌ఫర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఊహించని ప్రమాదం జరిగింది. లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక భారీ బోయింగ్ విమానం రన్‌వే పక్కన పార్క్ చేసి ఉన్న సమయంలో సడెన్‌గా కుప్పకూలింది. విమానం రన్‌వే పక్కన పార్కింగ్ బేలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ గేర్ ఒక్కసారిగా లోపలికి ముడుచుకుపోవడంతో లేదా విరిగిపోవడంతో విమానం ముందు భాగం నోస్… నేలకేసి బలంగా కొట్టుకుందని తెలుస్తోంది. ప్రమాదం జరిగే సమయానికి అదృష్టవశాత్తూ విమానంలో ప్రయాణికులు ఎవరూ లేరు. వారు విమానం ఎక్కడానికి కాస్త ముందే, మధ్యాహ్నం 12:45 గంటల ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. ఘటనపై సంబంధిత అధికారులు, లుఫ్తాన్సా సంస్థ దర్యాప్తు ప్రారంభించాయి. బోయింగ్‌ సంస్థ కూడా విచారణకు సహకరిస్తున్నట్లు తెలిపింది. ఐదు నెలల క్రితం కమర్షియల్‌ ఫ్లైట్‌గా పని చేయడం మొదలుపెట్టిన ఈ విమానం అప్పుడే ప్రమాదానికి గురి కావడం, విమానం నాణ్యతా లోపాలను బయటపెట్టిందని ప్రయాణికులు అంటున్నారు. ఆ సమయంలో విమానం లోపల క్యాబిన్ సిబ్బందితో పాటు కింద కార్గో లోడింగ్ చేస్తున్న గ్రౌండ్ స్టాఫ్ ఉన్నారు. విమానం కొన్ని మీటర్ల ఎత్తు నుంచి ఒక్కసారిగా కింద పడటంతో లోపల, కింద ఉన్న కొందరు ఉద్యోగులకు గాయాలయ్యాయి. వారికి ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ ఆసుపత్రిలో అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. 2011 నుంచి బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ విమానాలు నడుస్తున్నాయి. అయితే అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనతో విమానాల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. తాజాగా ఫ్రాంక్‌ఫర్ట్‌ విమానాశ్రయంలో జరిగిన ఘటనతో అసలు ఆ విమానాలు సేఫేనా అన్న చర్చ మళ్లీ తెర మీదకు వచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Update: గెట్ రెడీ.. వరుణుడు వచ్చేస్తున్నాడు! తెలుగు రాష్ట్రాలకు వర్షాల సందడి!

రూ. 2 లక్షల విలువైన పరుపులు ఇచ్చి.. ఎంతోమంది ప్రాణాలను కాపాడిన తండ్రీ కొడుకులు!

ఏఐ గురువులకు ఫుల్ డిమాండ్.. ఒక్క క్లాస్ చెబితే రూ. 23 లక్షల ఫీజు

ఇదేం పోయే కాలంరా.. కల్లాల్లో ధాన్యం బస్తాలు కొట్టేస్తున్న బీటెక్ స్టూడెంట్స్‌

ఫేక్‌ కాల్స్‌ భరతం పట్టనున్న గూగుల్‌.. ఎలా అంటే!

Follow Us