Viral Video: మూత్ర విసర్జన చేస్తుండగా జేబులో పేలిన గన్.. ఏం జరిగిందంటే..? వీడియో
మూత్ర విసర్జన చేస్తున్న ఓ యువకుడి ప్యాంట్ జేబులో తుపాకీ పేలింది. ఈ ఘనటలో అతని కాలికి బుల్లెట్ గాయమైంది. తీవ్రంగా గాయపడిన అతన్ని అధికారులు ఆస్పత్రికి తరలించారు.
మూత్ర విసర్జన చేస్తున్న ఓ యువకుడి ప్యాంట్ జేబులో తుపాకీ పేలింది. ఈ ఘనటలో అతని కాలికి బుల్లెట్ గాయమైంది. తీవ్రంగా గాయపడిన అతన్ని అధికారులు ఆస్పత్రికి తరలించారు. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో జరిగింది ఈ సంఘటన. సరిగ్గా మధ్యాహ్నం 12.20 గంట సమయంలో టైమ్స్ స్వ్కేర్‌లోని సబ్‌వే స్టేషన్‌లో 39 ఏళ్ల వ్యక్తి టాయిలెట్‌కి వెళ్లాడు. అతని ప్యాంట్‌లో బుల్లెట్లు లోడ్ చేసి గన్ ఉంది. అయితే, ప్యాంట్ తీసే క్రమంలో పొరపాటున గన్ ట్రిగర్ నొక్కాడు. దాంతో గన్ ఫైర్ అయ్యింది. బుల్లెట్ నేరుగా అతని కాలికి తగింది. తుపాకీ పేలుడుకి భారీ శబ్ధం రాగా.. టాయిలెట్‌లో ఉన్న మరో వ్యక్తి అక్కడి నుంచి భయంతో పరుగులు తీశాడు. కాగా, తనకు ఒక పెద్ద శబ్ధం వినిపించిందని మార్గరీటవిల్లే రిసార్ట్‌లోని సెక్యూరిటీ గార్డ్ మైఖేల్ బౌయీయా తెలిపాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: అప్పులు తీర్చడానికి ఏటీఎం చోరీ చేశాడు.. కట్ చేస్తే సీన్ రివర్స్! వీడియో
Petrol Bunk Fraud: పెట్రోల్ బంకుల్లో ‘మైక్రో చిప్’ మోసం.. కోట్లల్లో.. వీడియో