వైట్‌ హౌస్‌ లోపల ఎలా ఉంటుందో తెలుసా ??

Updated on: May 09, 2025 | 11:37 AM

వైట్‌ హౌస్‌.. అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం. దవళవర్ణంతో మెరిసిపోతూ అ్రగరాజ్యానికి గర్వకారణంగా నిలిచే ఈ భవనం ఇప్పటి వరకూ వెలుపలి రూపాన్ని మాత్రమే చూశాం. మరి ప్రపంచం మొత్తాన్నీ శాశించే ఈ భవనం లోపల ఎలా ఉంటుందో...! అని అందరికీ అనిపిస్తుంది. ఇదిగో వైట్‌ హౌస్‌ లోపల ఎలా ఉంటుందో మీ ముందుకు తీసుకొచ్చారు డొనాల్డ్‌ ట్రంప్‌ సెక్రటరీ కరోలినా లీవిట్‌.

హోమ్‌ టూర్‌ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ వద్ద అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అనుమతి లేనిదే లోనికి ప్రవేశించే అవకాశమే లేదు. ఫొటోలు, వీడియోలలో ఇప్పటి వరకు వైట్ హౌస్ ను బయట నుంచి మాత్రమే చూసే అవకాశం ఉంది. లోపల ప్రెస్ రూమ్ మినహా లోపలి గదులు ఎలా ఉంటాయనేది అందులో పనిచేసే సిబ్బందికి తప్ప ఎవరికీ తెలిసే అవకాశం లేదు. అయితే, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సెక్రటరీ కరోలినా లీవిట్ తాజాగా వైట్ హౌస్ హోమ్ టూర్ వీడియోను రూపొందించారు. మరో మహిళతో కలిసి వైట్ హౌస్ లోపల ఎలా ఉంటుందనేది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది. వైట్ హౌస్ లో తన రూమ్, తనతో పాటు పనిచేసే ఉద్యోగులు, ఫర్నీచర్ తదితర వివరాలను కరోలినా లీవిట్ ఈ వీడియోలో చూపించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ చేప తెలివి మామూలుగా లేదుగా.. వలనుంచి ఎలా తప్పించుకుందో చూడండి

మన్యం గిరుల్లో పూసే.. ఈ పుష్పాల ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా !!

ఇలాంటి యాక్సిడెంట్‌ జరిగితే బతకడం కష్టమే.. కానీ వీళ్లకు ఎక్కడో సుడి ఉన్నట్టుంది

ఖతర్నాక్‌ పాము.. స్నేక్‌ క్యాచర్‌కే షాకిచ్చిందిగా

బెల్లం, సోంపు కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో పరార్‌