ఔను.. ముగ్గురితో నాకు ఎఫైర్ ఉంది ! ఒప్పుకున్న బిల్ గేట్స్
జెఫ్రీ ఎప్‌స్టీన్ వ్యవహారంపై అమెరికాలో కొనసాగుతున్న విచారణ నేపథ్యంలో బిల్ గేట్స్ తన వ్యక్తిగత జీవితంపై స్పందించారు. గతంలో కొన్ని వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని అంగీకరిస్తూనే, ఎప్‌స్టీన్ తనను బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చని తెలిపారు. అయితే ఎలాంటి అక్రమ కార్యకలాపాల్లో తాను పాల్గొనలేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఎప్‌స్టీన్ నెట్‌వర్క్‌పై అమెరికాలో దర్యాప్తు కొనసాగుతోంది.
బిల్ గేట్స్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కఠోర వాస్తవాన్ని అమెరికా కాంగ్రెస్ కమిటీ ఎదుట బయటపెట్టారు. తనకు మూడు వివాహేతర సంబంధాలు ఉన్నాయని అంగీకరించారు. తనను బ్లాక్‌మెయిల్ చేయడానికి జెఫ్రీ ఎప్‌స్టీన్ ప్రయత్నించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కమిటీ ఎదుట బిల్‌గేట్స్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిజాన్ని బయటపెట్టారు. తనకు ముగ్గురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఒప్పుకున్నారు. తన బలహీనతను అడ్డుపెట్టుకుని ఎప్‌స్టీన్ బ్లాక్‌మెయిల్‌కు ప్రయత్నించారని ఆరోపించారు. ఇటీవల అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన జెఫ్రీ ఎప్ స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసాయి. జూన 10న జరిగిన ఈ విచారణకు సంబంధించిన అధికారిక ట్రాన్స్‌క్రిప్ట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్.. బిల్ గేట్స్ వివాహేతర సంబంధాల గురించి తెలుసుకుని, ఆయనను బ్లాక్‌మెయిల్ చేయడానికి ఆయనపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలపై అమెరికా హౌస్ ఓవర్‌సైట్ కమిటీ ఈ విచారణ చేపట్టింది. ప్రస్తుతం 70 ఏళ్ల బిల్ గేట్స్.. విచారణలో ముగ్గురు మహిళల పేర్లను ప్రస్తావించారు. రష్యాకు చెందిన బ్రిడ్జ్ గేమ్ ప్లేయర్ మిలా ఆంటోనోవా, అణు శాస్త్రవేత్త కరిమా నిగ్మతులీనా, డాక్టర్ ఆలిస్ జాకబ్స్ తో తనకు సంబంధాలు ఉన్నాయని తెలిపారు. గతంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, జెఫ్రీ ఎప్‌స్టీన్ మధ్య సంబంధాలపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తనకున్న పరిచయంపై గేట్స్ స్పందిస్తూ.. తామిద్దరం 2011 నుంచి 2014 మధ్య కాలంలో సుమారు 12 నుంచి 14 సార్లు ప్రత్యక్షంగా, రెండుసార్లు స్కైప్ కాల్స్ ద్వారా మాట్లాడుకున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు పెద్ద పెద్ద దాతల నుంచి నిధులు సేకరించే ఉద్దేశంతోనే అతడిని కలిశానని చెప్పారు. అప్పటికే ఎప్‌స్టీన్ లైంగిక నేరస్థుడిగా శిక్ష అనుభవించాడని తెలిసినప్పటికీ, అతడిని కలవడం తాను చేసిన పెద్ద పొరపాటని గేట్స్ అంగీకరించారు. దాతలను తీసుకువస్తానన్న ఎప్‌స్టీన్ మాటలు అబద్ధాలని తేలడంతో, ఆ తర్వాత అతనితో సంబంధాలను పూర్తిగా తెంచుకున్నట్లు బిల్ గేట్స్ వివరించారు. ఎప్‌స్టీన్‌కు సంబంధించిన మరిన్ని పత్రాలు విడుదలైన నేపథ్యంలో, అతని నెట్‌వర్క్‌పై చట్టసభ సభ్యులు విచారణ జరుపుతున్నారు. అమెరికా ప్రతినిధుల సభ పర్యవేక్షణ కమిటీ నిర్వహించిన రహస్య విచారణలో బిల్ గేట్స్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తాజాగా విడుదలైన విచారణ పత్రాలు తెలిపాయి. మూడు వివాహేతర సంబంధాల్లో రెండింటి గురించి ఎప్‌స్టీన్‌కు సమాచారం ఉందని గేట్స్ చెప్పారు. అయితే తన అఫైర్లకు, ఎప్‌స్టీన్‌కు ఎలాంటి సంబంధమూ లేదని ఆయన స్పష్టం చేశారు. ఎప్‌స్టీన్ తనను ఎప్పుడూ ప్రత్యక్షంగా బ్లాక్‌మెయిల్ చేయనప్పటికీ, అలా చేయాలని భావించి ఉండవచ్చని తాను నమ్ముతున్నట్లు గేట్స్ చట్టసభ సభ్యులకు తెలిపారు. గేట్స్‌కు లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఉన్నాయన్న ఆరోపణలను ఆయన ఖండించారు. తనకు ఎటువంటి వ్యాధులు లేవని, అలాగే ఎవరికీ రహస్యంగా మందులను సరఫరా చేయలేదని తేల్చి చెప్పారు. తాజా పరిణామాలతో, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కూడా అలర్టైంది. ఎప్‌స్టీన్‌తో తమ పూర్వ లావాదేవీలపై ఫౌండేషన్ ఇప్పటికే ఒక లోతైన సమీక్షను ప్రారంభించింది. ఈ వివాదంపై గేట్స్ స్పందిస్తూ, తన నిర్ణయాలకు తనే బాధ్యత వహిస్తానని ప్రకటించారు. జెఫ్రీ ఎప్‌స్టీన్ వివాదం ఇటీవల సంచలనం సృష్టించింది. కుంభకోణంలో పారిశ్రామికవేత్తలు, పొటిలికల్ లీడర్స్‌తో పాటు సెలబ్రిటీల పేర్లు వినిపించాయి. బిల్ క్లింటన్, ఎలాన్ మస్క్, ట్రంప్ పేర్లు ఆ పైల్స్‌లో ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఇండియాలోనూ పలువురు ఫేమస్ వ్యక్తుల పేర్లు ఇందులో ఉన్నట్లు తెలిసింది. అమెరికాకు చెందిన ఈ లైంగిక నేరస్థుడితో సంబంధం ఉన్నట్లుగా రోజుకొకరిపై ఆరోపణలు ఆందోళన కలిగించింది. సంపన్నుల కోసం మైనర్‌బాలికల అక్రమ రవాణా, వారితో వ్యభిచారం చేయించడం వంటి నేరాలకు జెఫ్రీ ఎప్‌స్టీన్ పాల్పడ్డాడు. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓ ప్రైవేట్ ఎస్టేట్‌లో జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ రాకెట్‌ను నడుపుతున్నాడనే సమాచారం 2005 మార్చిలో వెలుగుచూసింది. 14 ఏళ్ల బాధిత యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. తమ కుమార్తెను ఎప్‌స్టీన్ లైంగికంగా వేధించాడని వారు ఫిర్యాదు చేశారు. జెఫ్రీ ఎప్‌స్టీన్ ఒక బడా ఫైనాన్షియర్. అతడే ఈ రాకెట్‌ను నడిపేవాడని దర్యాప్తులో గుర్తించారు. దీంతో 2006 జులైలో ఎప్‌స్టీన్‌ను అరెస్టు చేశారు. అప్పట్లో అతడు 13 నెలలు జైలులో ఉన్నాడు తర్వాత విడుదలయ్యాడు. మళ్లీ 2019 జులై 6న ఎప్‌స్టీన్‌ను న్యూయార్క్‌లో అరెస్టు చేశారు. 2019 ఆగస్టు 10న జైలులోనే అనుమానాస్పద స్థితిలో అతడు చనిపోయాడు. ఎప్‌స్టీన్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఎప్‌స్టీన్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఆండ్రూ, మైకేల్ జాక్సన్ వంటి ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎప్ స్టీన్ సొంత ద్వీపంలో మహిళలపై జరిగిన ఘోరాలను ఈ ఫైల్స్ వెలికి తీశాయి. ఫైల్స్ లో అధ్యక్షుడు ట్రంప్ పేరు పలుమార్లు ప్రస్తావనకు రావడం వివాదాస్పదంగా మారింది. తాను ఎలాంటి తప్పుడు పనులు చేయలేదని ఎప్ స్టీన్ ఫైల్స్ బయటపెట్టింది తమ ప్రభుత్వమేనని ట్రంప్ చెప్పారు.అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక కేసు విచారణను ప్రభావితం చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. బాలికల అక్రమ రవాణా, లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన జెఫ్రీ ఎప్‌స్టీన్ 2019లో అమెరికా జైలులో సూసైడ్ చేసుకున్నాడు. ఏడాది తర్వాత ఈ క్రైమ్ కేస్ ఆధారంగా ‘జెఫ్రీ ఎప్‌స్టీన్ : ఫిల్తీ రిచ్’ పేరుతో నెట్ ఫ్లిక్స్‌లో ఓ డాక్యుమెంటరీ రిలీజైంది. మొత్తం 4 ఎపిసోడ్స్ ఉన్న ఈ డాక్యుమెంటరీలో ఉపాధ్యాయుడి నుంచి ఫైనాన్షియర్‌గా ఎప్‌స్టీన్ ప్రయాణం ఎలా సాగింది? లైంగిక నేరాలకు ఎలా పాల్పడ్డాడు? నిందితుని చేతిలో మోసపోయిన వారి వ్యథలు ఈ సిరీస్‌లో చూపించారు. చివరకు జైలులోనే ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితుల గురించి కూడా చూపించారు. ఆ సిరీస్‌కు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సీటుకోసం సమరం.. పాలిటిక్స్‌లో కాదు.. ఆర్టీసీ బస్సులో..
గుడ్‌న్యూస్.. పోస్టాఫీసులో పేపర్ వర్క్ లేకుండానే డిపాజిట్లు, విత్‌డ్రాలు!
క్రెడిట్ కార్డు, డిజిటల్ మోసాలకు చెక్.. ఆర్‌బీఐ సంచలన నిబంధనలు!
టిఫిన్ సెంటర్‌లో వేడి వేడిగా వడలు లాగించేస్తున్నారా.. ఈ వీడియో చూడండి!
